అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం ప్రారంభిస్తే ఇక కరోనా ఖతమైపోతుంది

  • Published By: nagamani ,Published On : July 23, 2020 / 11:32 AM IST
అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం ప్రారంభిస్తే ఇక కరోనా ఖతమైపోతుంది

అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు ప్రారంభించగానే కరోనా వైరస్ మహమ్మారి ఖతం అవుతుందంటూ మధ్యప్రదేశ్ బీజేపీ నేత. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ బుధవారం (జులై 22,2020) మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను అంతమొందించటానికి ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు వ్యాక్సిన్లు తయారు చేసే క్రమంలో కృషి చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్ల ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇవేమీ అవసరమే లేదన్నట్లుగా..రాముడి దేవాలయం కట్టటం ప్రారంభిస్తే కరోనా వైరస్ పోతుందని రామేశ్వర శర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

అంటే ఆగస్టు 5వతేదీన అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్న క్రమంలో అవి ప్రారంభం కాగానే శ్రీరాముడు పునర్జన్మ ఎత్తి ప్రజల సంక్షేమానికి పాటుపడతాడని..రాముడి పునర్జన్మతో కరోనా మహమ్మారి విధ్వంసం మొదలవుతుందని ప్రజలు కరోనా నుంచి బైటపడొచ్చని రామేశ్వర్ శర్మ వ్యాఖ్యానించారు. మానవజాతి సంక్షేమం కోసమే రాక్షసులను సంహరించటానికే ఆనాడు రాముడు పుట్టాడని..ఇప్పుడు రామజన్మ భూమి అయిన అయోధ్యలో రామమంది నిర్మాణ పనులు ప్రారంభం అయితే రాముడు పునర్జన్మ ఎత్తి ప్రజల్ని కరోనాబారి నుంచి రక్షిస్తాడని అన్నారు. అయోధ్య రామ మందిన నిర్మాణ పనులతో కరోనా అంతమవుతుందని అన్నారు.

భారతదేశంతోపాటు ప్రపంచం మొత్తం కరోనాతో అష్టకష్టాలు పడుతున్నాయని అన్న ఆయన ఆగస్టు 5న రామాలయం నిర్మాణ పనుల్లో సామాజిక దూరం పాటిస్తూ 200 మంది రామాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి ప్రకటించారు. రామాలయానికి పునాదిరాయి వేసే ముందు ప్రధాని మోదీ హనుమాన్ గర్హి, రాంలాలా దేవాలయాన్ని సందర్శిస్తారని, అక్కడ ఓ మొక్క నాటి భూమి పూజ చేస్తారని గోవింద్ తెలిపారు.

కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 11,92,915కు చేరుకుంది. కరోనా వల్ల దేశంలో మొత్తం 28,732 మంది మరణించారు.