విశాఖ జిల్లా వ్యాప్తంగా EVM ల మొరాయింపు 

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 05:16 AM IST
విశాఖ జిల్లా వ్యాప్తంగా EVM ల మొరాయింపు 

విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నారు. దీంతో పోలింగ్ అత్యంత మందకొడిగా జరుగుతోంది. ఉదయం నుంచి ఇప్పటి వరకూ కేవలం 10 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో విశాఖ నగరంలో 7 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు కాగా గాజువాకలో 10 శాతం, అనకాపల్లిలో 9 శాతం  నమోదయ్యింది. ఇలా  ఓవరాల్ గా విశాఖపట్నం జిల్లాలో 10 శాతం ఓటింగ్ నమోదు జరిగింది. 
 

అనకాపల్లిలో జీవీఎంసీ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 228 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. ముఖ్యంగా విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఈవీఎంలు పనిచేయకపోవటంతో ఓటింగ్ అత్యంత తక్కువగా నమోదు అవుతోంది.  పాడేరు. జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో ఈవీఎంలు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. అలాగే యలమంచిలి, పాయకరావు పేట, నర్శీపట్నం వంటి తదితర ప్రాంతాలో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.