రాజధానికి భూములిచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులా? : చంద్రబాబు ఆగ్రహం

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 05:12 AM IST
రాజధానికి భూములిచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులా? : చంద్రబాబు ఆగ్రహం

రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..తమ భూముల్ని ఇచ్చి..ఇప్పుడు రాజధాని వేరే ప్రాంతానికి రాజధాని అంటూ రైతుల్ని ఆందోళనలో పడేసిన ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేస్తున్నా రైతులను అరెస్ట్ చేయటంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రైతుల అరెస్ట్ లను ఖండించారు. నష్టపోయిన రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టటం దారుణమన్నారు. 

రైతులు శాంతియుతంగా నిరజన వ్యక్తంచేస్తు ఆందోళన చేస్తుంటే వారిపై పెట్టిన కేసులకు వారి నిరసనలకు పొంతన ఉందా? రాజధానికి భూములిచ్చి రైతులను జైలు పాలు చేస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పోలీసులతో రైతుల ఆందోలను అణిచివేయాలేరనీ రైతుల్ని బాధపెట్టటం ఇష్టమొచ్చినట్లుగా కేసులు బనాయించటం మంచిది కాదనీ..ఇంతటి ఘోరమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు మాజీ సీఎం చంద్రబాబు.