కౌన్సిల్ రద్దు అంశం మరో ఉన్మాద చర్య..ఇంతకింతా మూల్యం చెల్లించుకోక తప్పదు: చంద్రబాబు 

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 06:38 AM IST
కౌన్సిల్ రద్దు అంశం మరో ఉన్మాద చర్య..ఇంతకింతా మూల్యం చెల్లించుకోక తప్పదు: చంద్రబాబు 

శాసన మండలి రద్దు చేస్తానని సీఎం జగన్ అనటం మరో ఉన్మాద చర్య అని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో టీడీపీ ఎమ్మెల్సీలు హీరోలయ్యారని తెలిపారు. 
 
శాసన మండలి అనేది ప్రజాస్వమ్య పరిరక్షణ ఉద్యమం అనీ..అటువంటి మండలిని రద్దు చేస్తామని అనటం ఆ దిశగా జగన్ వ్యవహరించటం మరోఉన్మాద చర్య అనీ టీడీపీ నేతలపై అక్కసుతోనే వైసీపీ నేతలు దాడులకు తెగించారని దీన్ని టీడీపీ నేతలు ఎదుర్కొంటున్నారనీ ఇది జగన్ అహకారానికి నిదర్శనమైతే..టీడీపీ హీరోలుగా అయ్యారని అన్నారు.   
అమరావతి తరలింపు విషయంలో విచారణ కొనసాగుతుండగా ఆయా విభాగాలకు సంబంధించి కార్యాలయాల తరలింపు మంచిది కాదని సూచించారు.

కౌన్సిల్ రద్దు తీర్మానం చేయకుండా అసెంబ్లీలో చర్చ రాజ్యాంగానికి విరుద్ధమనీ..కౌన్సిల్ రద్దు చేస్తామని తీసుకునే ఉన్మాద చర్యలకు భయపడేది లేదని టీడీపీ నేతలకు చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. జగన్ బెదిరింపులకు లొంగేది లేదని నేతలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. కౌన్సిల్ రద్దు చేస్తే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారనీ..దీనికి జగన్ ఇంతకింతా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ అన్నీ అబద్దాలాడుతున్నారనీ.. దీనికి తగిన శాస్త్రి వైసీపీ అనుభవించక తప్పదని అన్నారు.