భానుడు ఉగ్రరూపం : ఏపీ, తెలంగాణలో మండుతున్న ఎండలు

  • Published By: veegamteam ,Published On : May 12, 2019 / 11:12 AM IST
భానుడు ఉగ్రరూపం : ఏపీ, తెలంగాణలో మండుతున్న ఎండలు

ఏపీ, తెలంగాణలో భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఉదయం 8గంటల  నుంచే ఎండలు నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపంతో రోడ్ల పై జనాలు కనబడటం లేదు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. రద్దీగా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 

ఏపీలోనే ప్రకాశం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాత్రిళ్లు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  

గుంటూరు జిల్లాలో భానుడి భగభగలకు జనం విలవిల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో….జనం ఠారెత్తిపోతున్నారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు…ప్రజలకు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో మిగతా ప్రాంతాల కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. అయినా సింగరేణి యాజమాన్యం పని వేళలు మార్చటం లేదు. పని ప్రదేశాల్లో ఎండల తీవ్రత పెరిగింది. విధులు నిర్వహించలేకపోతున్నారు. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లిలో కార్మికుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. విధులు చేయలేం అంటూ సెలవులు పెడుతున్నారు. 

ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువుగా నమోదవుతున్నాయి. విధుల్లోకి వెళ్లిన సింగరేణి కార్మికులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.  సింగరేణి యాజమాన్యం పనివేళల్ని ఏమాత్రం మార్చడం లేదు.  

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉక్కపోతకు జనం విలవిల్లాడుతున్నారు. చాలా మంది వడదెబ్బ తగిలి ఆస్పత్రి పాలవుతుంటే..  వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో… కార్మికుల హజరు తక్కువగా నమోదవుతోంది. వడదెబ్బ తగిలి ఆస్పత్రి ప్రజానీకం పాలవుతున్నారు. ఎండ తీవ్రతకు వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.  

ఉమ్మడి ఆదిబాలాబాద్‌ జిల్లాలో వేసవి ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. భగ్గుమంటున్న ఎండలతో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.