‘బ్రిటీష్ పాలనలోనూ రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు’

‘బ్రిటీష్ పాలనలోనూ రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు’

Farm Laws:ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ బుధవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రైతు మూడు కొత్త చట్టాల గురించి మాట్లాడారు. భారీగా తరలివచ్చి ఢిల్లీ బోర్డర్ లో చేపట్టిన ఆందోళన గురించి ముకుమ్మడిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘బ్రిటిష్ వారు కూడా ఒకానొక సమయంలో రైతు చట్టాలను వెనక్కు తీసుకున్నారు’ అని అన్నారు.

రైతు ఆందోళనపై మాట్లాడేందుకు పార్లమెంట్ లో 15గంటల సమయం కేటాయించారు. క్వశ్చన్ హవర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేసిన తర్వాతే చర్చ మొదలైంది. ఈ డిస్కషన్ లోనే రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టిన ర్యాలీలో రైతుల వేషంలో వచ్చిన వారు కనిపించకుండా పోయారేంటని పీఎం మోడీని ప్రశ్నించారు.

16ప్రతిపక్ష పార్టీలు ఐదు గంటల పాటు చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. దానిని ప్రభుత్వం 15గంటలకు పొడిగించింది. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు అయిన ఘాజీపూర్, సమాజ్‌వాదీ పార్టీ లీడర్ రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఘాజీపూర్ లో ఉన్నంత సెక్యూరిటీ పాకిస్తాన్ బోర్డర్ లోనూ కనిపించలేద’ని అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు రైతు చట్టాలు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతే గతేడాది ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ను వాటిపై సంతకాలు పెట్టొద్దని రిక్వెస్ట్ చేశాయి. ఇది రాజ్యసభలో అప్రజాస్వామికమని ఆరోపించాయి. ఏదేమైనా మూడు బిల్లులకు రాష్ట్రపతి సంతకం పెట్టేశారు.

కనీస సంపాదన లేకుండా పోతుందని ఈ కొత్త చట్టాలపై తమకు ఎటువంటి నమ్మకం లేదని.. చెప్తున్నారు. 11రౌండ్లు భేటి అయినప్పటికీ రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరకుండా పోయింది.