పెట్రోల్‌ పోసుకుని రాజధాని ప్రాంత రైతు ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధానిప్రాంత రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 09:08 AM IST
పెట్రోల్‌ పోసుకుని రాజధాని ప్రాంత రైతు ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధానిప్రాంత రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధానిప్రాంత రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు రమేశ్‌ కుమార్‌. అక్కడే ఉన్న పోలీసులు రమేశ్‌ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అమరావతి నిర్మాణానికి 4 ఎకరాల భూమి ఇచ్చిన రమేశ్‌ కుమార్‌.. రాజధానిని తరలించవద్దని డిమాండ్‌ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రమేశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ ప్రకటన, జీఎన్‌ రావు కమిటీ రిపోర్ట్‌పై రైతులు భగ్గుమంటున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగుతుండగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోను ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అమరావతిలో రాజధానిని కొనసాగించాలంటూ తుళ్లూరు మహిళలు వినూత్న నిరసనకు దిగారు. విష్ణు, లలిత సహస్ర నామ పారాయణం చేశారు. అమరావతికి పట్టిన గ్రహణం వీడేందుకే ఈ పారాయణం చేశామన్నారు మహిళలు. 

రైతుల ఆందోళనలతో ఏపీ రాజధాని ప్రాంతం రగులుతోంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రిలే దీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతుల ఆందోళనలు హోరెత్తుతుండగా… కృష్ణా, గుంటూరు జిల్లాల్లోను పలుచోట్ల  ప్రజా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. వినూత్న రీతిలో రైతులు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందంటూ కొందరు కాళ్లకు బదులు చెప్పులు వేసుకుని నిరసన తెలిపారు. మరికొందరు నల్లదుస్తులతో ధర్నా నిర్వహించారు. ఇంకొందరు కళ్లకు గంతలు కట్టుకుని, రాజధాని ప్రాంత మట్టి ప్యాకెట్లను మెడలో వేసుకుని నిరసన తెలిపారు.