బ్యాలెట్ పోరు : నామినేషన్లు వేయడానికి రైతుల క్యూ

  • Published By: madhu ,Published On : March 25, 2019 / 06:46 AM IST
బ్యాలెట్ పోరు : నామినేషన్లు వేయడానికి రైతుల క్యూ

లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్‌ గడువు మార్చి 25వ తేదీ సోమవారంతో ముగియనుంది. దీనితో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇదిలా ఉంటే రైతులు కూడా క్యూ కట్టారు నామినేషన్లు దాఖలు చేయడానికి. పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు వేయడానికి కలెక్టరేట్ కార్యాలయం వద్ద బారులు తీరారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. 

పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలంటూ కొన్నాళ్లుగా నిరసనలు తెలుపుతున్న నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలోని రైతులు చివరి అస్త్రం ఎంచుకున్నారు. తమ ఆవేదనను దేశవ్యాప్తంగా వినిపించేందుకు బ్యాలెట్‌ పోరు ఎంచుకున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ మినహా 6 నియోజకవర్గాల రైతులు గ్రామానికి ఐదుగురు చొప్పున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. మార్చి 25వ తేదీ సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆఫీసు వద్ద రైతులు నామినేషన్ వేయడానికి క్యూలో నిలుచున్నారు. ఎర్రజొన్న రైతులు, చెరకు రైతులు రెంజల్ మండల చెరకు రైతులు కూడా నామినేషన్లు వేస్తున్నా వారిలో ఉన్నారు. రైతులు వరుసబెట్టి నామినేషన్లు దాఖలు చేస్తుండడంతో ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. స్పష్టమైన హామీనిస్తే గాని నామినేషన్లను ఉపసంహరించుకుంటామని రైతులు తేగెసి చెబుతున్నారు. 

–  టీఆర్‌ఎస్‌ తరపున అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత. 
కాంగ్రెస్‌ నుంచి మధుయాష్కీ. 
బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్‌..లు బరిలో ఉన్నారు.