మారుతీరావు ఆత్మహత్యపై అమృత సంచలన వ్యాఖ్యలు!..ఆస్తుల కోసమే!!

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 08:56 AM IST
మారుతీరావు ఆత్మహత్యపై అమృత సంచలన వ్యాఖ్యలు!..ఆస్తుల కోసమే!!

చనిపోయినవారికి మర్యాదు ఇవ్వాలి. వాళ్లు మనకు శతృవులైనా సరే మిత్రులైనా సరే..అందుకే నా భర్తను చంపిన నా తండ్రి భౌతిక కాయాన్నిచూడటానికి వెళ్లాననీ..కానీ నన్ను మా నాన్న మారుతీరావు బంధువులు కనీసం శవం వద్దకు కూడా రానివ్వలేదని అమృత వాపోయింది. కానీ తండ్రి మారుతీరావు నేను ప్రేమించి పెళ్లి చేసుకన్న నా భర్త ప్రణయ్ ను కిరాతకంగా హత్య చేసిన చంపేసినా ఆయన చనిపోయిన తరువాత చనిపోయినవారికి మర్యాద ఇవ్వాలనే ఉద్ధేశంతోనే నేను మారుతీరావు భౌతికకాయాన్ని చూడటానికి  శ్మశానానికి వెళ్లానని కానీ ఆయన బంధువులు నన్ను చూడగానే ఆగ్రహావేశాలకు లోనై నన్ను దగ్గరకు కూడా రానీవ్వలేదని అన్నది అమృత.  

కానీ మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత పరికివాడు కాదనీ..కానీ బంధువులు ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకురావటం..నమ్మినవారు ద్రోహం చేయటం..ఆస్తుల కోసం ఇబ్బందులకు గురి చేయటం వల్లన తట్టుకోలేక ఆత్మహత్య చేసి ఉండవచ్చిన అన్నది అమృత. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కిరాయి మనుషులతో హత్య చేయించిన మారుతీరావు పశ్చాత్తాపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తాను మొదట భావించాననీ..కానీ పశ్చాత్తాపడలేదని అందరూ అంటున్నారు.(మారుతీరావు ఆత్మహత్యకు వీలునామానే కారణమా ? )

నీ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? నమ్మిన వారు..ఆస్తుల కోసం ఇబ్బందులకు గురి చేయటం వల్లకూడా ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చేమోనని తమ్ముడు శ్రవణ్ తో మారుతీరావుకు ఆస్తుల విషయంలో విభేధాలు రావటం వల్ల కూడా జరిగి ఉండవచ్చని కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం పూర్తిగా తనకు తెలీదనీ..తనకు తెలిసినంత వరకూ మారుతీరావు..అతని తమ్ముడు శ్రవణ్ తన వివాహం తాను బైటకు వచ్చేశాక పంపకాలు చేసుకున్నారు. ఆ విషయంలో తమ్ముడితో మారుతీరావుకు ఎన్నో విభేధాలున్నాయి..అదికూడా కారణమై ఉండవచ్చని అమృతవర్షిణి తెలిపింది.  

పరువుహత్యతో పోయిన పరువు…ప్రణయ్ ను సుపారి ఇచ్చి చంపించాడనే ఆరోపణలు..
మారుతీరావు ఏకైక కుమార్తె అమృతవర్షిణి. అమృత 2018 మేలో మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన ప్రణయ్‌ కుమార్‌ను ప్రేమించి హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నారు. 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ను కిరాయి వ్యక్తులు హత్య చేయగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు సెప్టెంబర్‌ 15న పోలీసులకు లొంగిపోయాడు. ఏడు నెలలపాటు జైలులోనే ఉన్న అతను బెయిల్‌పై బయటకు వచ్చి న తర్వాత మధ్యవర్తుల ద్వారా తన బిడ్డను ఇంటికి పిలిపించుకునేందుకు యత్నించాడు.  అందుకు అమృత అంగీకరించలేదు. గత డిసెంబర్‌లోనూ మరోమారు మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి చేయగా అమృత పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు కేసు నమో దు చేసి రెండోసారి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో సైతం మారుతీరావు 20రోజులు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యాడు.

మారుతీరావును వెంటాడిన కేసులు.. 
ప్రణయ్‌ హత్య తరువాత జరిగిన పరిణామాల గురించి సైఫాబాద్‌ పోలీసులు మిర్యాలగూడ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. హత్య కేసులో నల్లగొండ పోలీసులు పక్కా ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేయగా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టులో విచారణ తుదిదశకు చేరుకున్నది. ఈ కేసులో తనకు శిక్షపడే అవకాశాలున్నాయనే భయంతో మారుతీరావు మానసికంగా కుంగిపోయాడు. ఇటీవల తన గోదాంలోనూ గుర్తుతెలియని మృతదేహం లభించడంతో పోలీసులు విచారిస్తున్నారు. ప్రణయ్‌ హత్య తరువాత కూతురితోపాటు దగ్గరి బంధువులు కూడా తనతో సరిగ్గా ఉండటం లేదనే ఆవేదనతో తీవ్ర ఒత్తిడికి గురైనట్టు సమాచారం.

డబ్బుల కోసం ఒత్తిడి.. 
ప్రణయ్‌ హత్య కేసులో నిందితుల నుంచి మారుతీరావు బ్లాక్‌మెయిలింగ్‌కు గురైనట్టు తెలుస్తున్నది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో సుపారీ గ్యాంగ్‌తో మారుతీరావుకు విభేదాలు వచ్చినట్టు సమాచారం. హత్యకేసులో ప్రధాన నిందితుడిగా మారుతీరావు ఉండగా.. సుభాష్‌శర్మ, హజ్గర్‌ అలీ, మహ్మద్‌బారీ, కరీం, శ్రవణ్‌, శివ నిందితులుగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మారుతీరావును బెదిరించి, ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు అప్రూవర్లుగా మారుతామని బెదిరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకు గురైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  ఈ క్రమంలో పోస్ట్ మార్టం రిపోర్టు రావటంతో మారుతీరావుది ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు.

Also Read | అరవై ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నాయకులు