సమాఖ్య కూటమి రావాలి : సీఎం కేసీఆర్

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 03:37 PM IST
సమాఖ్య కూటమి రావాలి : సీఎం కేసీఆర్

నల్లగొండ : దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. పెను మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇది జరగాలంటే 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాహుల్, మోడీకి బానిసలుగా ఉంటారని అన్నారు. దేశం బాగుపడటమే తన లక్ష్యమన్నారు. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తానని చెప్పారు. సమాఖ్య కూటమి వస్తేనే దేశానికున్న దారిద్ర్యం పోతుందన్నారు. 

ఇతర మతాలను దెబ్బతీయాలని చూసేది హిందుత్వం కాదన్నారు. ఎన్నికల తెల్లారే బీజేపీకి శంకరగిరిమాన్యాలే దిక్కని ఎద్దేవా చేశారు. రైతు బంధు, రైతు బీమా దేశంలో ఎక్కడా లేవన్నారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉన్నా వాడటం లేదన్నారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారని క్యామ మల్లేశం చెప్పారని తెలిపారు. 

థర్మల్ ప్రాజెక్టును మూసేస్తానన్న కోమటిరెడ్డినే ప్రజలు మూసేశారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్ సవాల్ చేశారని…మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. రెండు మూడేళ్లలో అద్భుతం జరుగబోతోందన్నారు. 18 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకబోతుందన్నారు.