ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ : ఏపీ వెహికల్స్ కు సింగిల్ సిరీస్ 

ఆంధ్రప్రదేశ్ లో ఇకపై వెహికల్స్ అన్నింటికి ఒకే సిరీస్ విధానం రానుంది. ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ అనే సరికొత్త పక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రవాణాశాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.అన్ని జిల్లాల్లోనూ ఒకే సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్‌ అమలుకానుంది.

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 06:43 AM IST
ఒకే రాష్ట్రం..ఒకే కోడ్  : ఏపీ వెహికల్స్ కు సింగిల్ సిరీస్ 

ఆంధ్రప్రదేశ్ లో ఇకపై వెహికల్స్ అన్నింటికి ఒకే సిరీస్ విధానం రానుంది. ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ అనే సరికొత్త పక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రవాణాశాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.అన్ని జిల్లాల్లోనూ ఒకే సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్‌ అమలుకానుంది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఇకపై వెహికల్స్ అన్నింటికి ఒకే సిరీస్ విధానం రానుంది. ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ అనే సరికొత్త పక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రవాణాశాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.అన్ని జిల్లాల్లోనూ ఒకే సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్‌ అమలుకానుంది. ఇప్పటి వరకూ జిల్లాల వారీగా వేరు వేరుగా సిరీస్‌లు ఉండేవి. 
ఇకనుండి ఏపీలోని అన్ని జిల్లాల్లోను ఏపీ 39 సిరీస్‌తోనే వాహనాల రిజిస్ట్రేషన్‌‌కు వీలు కల్పిస్తూ రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ తుది నోటిఫికేషన్‌ జనవరి 10న  జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాలకు ఉన్న పీ సిరీస్ మాత్రం అలాగే కొనసాగుతుంది. 

ఆర్టీసీ వాహనాలకు ఏపీ 39 జడ్‌, ఇతర రవాణా వాహనాలకు టీ, యు, వి, డబ్ల్యూ, ఎక్స్‌, వై అక్షరాలతో ప్రారంభం కానున్నాయి. ‘ఓ’ అక్షరం సున్నాలా ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ కేటాయించే అవకాశం ఉండదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ అంశంపై 2018 అక్టోబరులోనే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి రాష్ట్రంలోని 23 (జిల్లాల్లోఏపీ, తెలంగాణ కలిపి)ఏపీ 01 నుంచి ఏపీ 38 వరకూ ఆర్టీఏ కోడ్‌ నంబర్లు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని జిల్లాలకు TS రిజిస్ట్రేషన్‌కు మారిపోగా..ఏపీలోని ఆర్టీఏ కార్యాలయాల ఆధారంగా అనంతపురం-01 నుంచి మొదలుపెట్టి పశ్చిమ గోదావరికి చివరి నంబరు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అటువంటి ప్రచారాలకు తావు లేకుండా..రాష్ట్రమంతా ఒకే కోడ్‌ ఇవ్వాలని రవాణాశాఖ నిర్ణయించింది. దీనిప్రకారం ఇకపై జిల్లా ఏదైనా రిజిస్ట్రేషన్‌ నంబర్లు మాత్రం ‘ఏపీ39’ నుంచే మొదలవుతాయి. ప్రస్తుత సిరీస్‌ ముగిసిన తర్వాత కోడ్‌ను ఏపీ39 నుంచి ఏపీ40కి మారుస్తారు. 

ఫ్యాన్సీ నంబర్స్ కావాలంటే కష్టమే
ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ తో ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకునేవారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. జిల్లాకో కోడ్ ఉండటంతో ఎదో ఒక సిరీస్‌లో ఫాన్సీ నెంబర్‌ను కావాలనుకునేవారికి ఈజీ అయ్యేది. ఇప్పుడలా కుదరదు.రాష్ట్రమంతా ఒకటే కోడ్ రావడంతో ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే ఆన్‌లైన్‌ ద్వారా బిడ్డింగ్‌కు వెళ్లాల్సిందే. దీనివల్ల ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పెరగడమే కాకుండా రవాణాశాఖకు ఆదాయం కూడా పెరుగే అవకాశముంది. ఎందుకంటే సెంటిమెంట్ తో కొందరు…ఫ్యాన్సీ నంబర్ కావాలనే కోరిక వున్నవారు..లేక స్పెషల్ గా వుండాలని కోరుకునేవారు ఈ ఫ్యాన్సీ నంబర్స్ కోసం ఆన్ లైన్ బిడ్డింగ్ కు వెళ్లాల్సి వుంటుంది.