నీటి కష్టాలు : 40 టన్నుల చేపలు మృతి

చెరువు ఒడ్డుకు చేపలు ఎండపోసినట్లు ఉంది కదా..ఇవి అవి కావు..చనిపోయిన చేపలు..క్వింటాలో..రెండు క్వింటాలో కాదు..ఏకంగా 40 టన్నుల చేపలు మృతి చెందాయి.

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 06:24 AM IST
నీటి కష్టాలు : 40 టన్నుల చేపలు మృతి

చెరువు ఒడ్డుకు చేపలు ఎండపోసినట్లు ఉంది కదా..ఇవి అవి కావు..చనిపోయిన చేపలు..క్వింటాలో..రెండు క్వింటాలో కాదు..ఏకంగా 40 టన్నుల చేపలు మృతి చెందాయి.

చెరువు ఒడ్డుకు చేపలు ఎండపోసినట్లు ఉంది కదా..ఇవి అవి కావు..చనిపోయిన చేపలు..క్వింటాలో..రెండు క్వింటాలో కాదు..ఏకంగా 40 టన్నుల చేపలు మృతి చెందాయి. వనపర్తి జిల్లా వీపనగండ్ల పల్లె చెరువులో గత కొద్ది రోజుల క్రితం సర్కార్ ఇందులో చేపలను వదిలింది. చేపలు పెరిగి పెద్దగై మంచి లాభమొస్తుందని రైతులు అనుకున్నారు. కానీ వారి కల చెదిరింది. పంటలు ఎండిపోతున్నాయని..మోటార్లు పెట్టి చెరువులోని నీటిని పంటలకు మళ్లించారు.
Read Also : ఓడిపోతామనే భయంతోనే ప్రేలాపనలు : తలసాని

ఇంకేముంది..నీరంతా తగ్గుతూ వచ్చింది. ఎండలకు తాళలేక చేపలు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన చేపలను చూసిన రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం చనిపోయిన చేపలు కొట్టుకొచ్చాయి. 40 టన్నుల చేపలు మృ‌తి చెందాయి. సుమారు రూ. 25 నుండి 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 
Read Also : ఉత్సాహం తగ్గించుకోండి : టిక్ టాక్‌కు ఏజ్ లిమిట్, 60లక్షల వీడియోలు డిలీట్