నాగార్జునసాగర్ లోకి భారీగా వరద నీరు

  • Published By: chvmurthy ,Published On : September 21, 2019 / 03:14 PM IST
నాగార్జునసాగర్ లోకి భారీగా వరద నీరు

ఎగువున కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయానికి  భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.32 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో  కూడా 1.32 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. 

డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

దీంతో అధికారులు ప్రాజెక్టు 6 క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.