ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులు : శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, తుంగభద్ర, హంద్రీ నుంచి శ్రీశైలానికి లక్షా 9వేల 481 క్యూసెక్కుల వరద

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 02:41 AM IST
ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులు : శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, తుంగభద్ర, హంద్రీ నుంచి శ్రీశైలానికి లక్షా 9వేల 481 క్యూసెక్కుల వరద

శ్రీశైలం ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, తుంగభద్ర, హంద్రీ నుంచి శ్రీశైలానికి లక్షా 9వేల 481 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 214.3637 అడుగులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో పవర్ జనరేషన్ చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా 5వేలు, కల్వకుర్తికి 2వేల 400, హంద్రీనీవాకు 2వేల 26 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఔట్‌ ఫ్లో లక్షా 58వేల 232 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 3 క్రస్ట్‌ గేట్లను ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

అటు జూరాల ప్రాజెక్ట్ కి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు 5 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 79వేల క్యూసెక్కులు. జూరాల ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 9.255 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 9.657 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318.320 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో 434 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.