ఆఫీసే బార్ : మందుకొడుతూ చిక్కిన ఫారెస్టు ఆఫీసర్

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 01:02 AM IST
ఆఫీసే బార్ : మందుకొడుతూ చిక్కిన ఫారెస్టు ఆఫీసర్

కామారెడ్డి : ఆఫీసర్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా ఆఫీసులనే బార్లగా మార్చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు దర్జాగా పెగ్గుల మీద పెగ్గులు వేస్తూ మీడియాకు చిక్కుతూనే ఉన్నారు. ఇది తప్పని తెలిసినా…ఇతరులు కూడా దర్జాగా మందు కొడుతున్నారు. తాజాగా ఎల్లారెడ్డిలో అటవీశాఖ కార్యాలయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారి.. ఏకంగా కార్యాలయాన్ని బార్‌గా మార్చేశాడు. మరో సిబ్బందితో కలిసి దర్జాగా మందుకొడుతూ మీడియాకు చిక్కాడు. అక్కడా ఇక్కడా ఎందుకని అనుకున్నాడేమో.. ఆఫీసులోని తన ఛాంబర్ లోనే మద్యం పార్టీ అరేంజ్ చేశాడు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కృష్ణంరాజు. తోటి ఉద్యోగితో కలిసి మందుకొడుతూ  ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి రాగానే ఆ ఆఫీసర్ అవాక్కయ్యాడు. మద్యం గ్లాసులు దాచేందుకు ప్రయత్నించాడు. ఈ తతంగాన్నంతా రికార్డ్ చేస్తున్న విలేకరులపై దాడికి యత్నించాడు. వారి సెల్ ఫోన్ ను విసిరికొట్టాడు. అదేమని అడిగితే అక్కడినుంచి పారిపోయాడు.