తొమ్మిదిమంది స్మగ్లర్లు అరెస్ట్ : పులి చర్మం, గోర్లు స్వాధీనం 

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 09:36 AM IST
తొమ్మిదిమంది స్మగ్లర్లు అరెస్ట్ : పులి చర్మం, గోర్లు స్వాధీనం 

తొమ్మిదిమంది స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అరెస్ట్ చేసిన స్మగ్లర్ల నుంచి అధికారులు పులి చర్మంతో పాటు 17 పులి గోర్లు, ఓ బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లర్లు విదేశీయులతో సంబధాలున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుల సమాచారం మేరకు విదేశీయుల కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ ప్రత్యేక బృందాలు విదేశీయుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి. 

ఒక వేటగాళ్లు..మరోపక్క స్మగ్లర్లకు పెద్ద పులులు బలైపోతున్నాయి. చర్మం, గోర్ల కోసం పులుల వేట జరుగుతోంది. దీనిపై అధికారులు ఎంతగా నిఘా పెట్టినా స్మగ్లర్ల్ ఆగడాలు కొనసాగుతునే ఉన్నాయి. అధికారుల కళ్లు కప్పి పులులను వేటాడి..చర్మం, గోర్లు స్మగ్లింగ్ చేస్తునే ఉన్నారు.
ఈక్రమంలో స్మగ్లర్ల కదలికలపై పటిష్టమైన నిఘా వేసిన ప్రకాశం జిల్లా  ఫారెస్ట్ అధికారులు గిద్దలూరులో తొమ్మిదిమంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చర్మంతో పాటు 17 పులి గోర్లు, ఓ బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశీయులతో సంబంధాలున్నట్లుగా అనుమానం వచ్చిన అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టగా అది నిజమని తేలటంతో సదరు విదేశీయుల గురించి గాలిస్తున్నారు.