EXCLUSIVE:రాజధానులపై మైసూరా మాట : రాజధాని కర్నూలులో పెట్టండి, లేదంటే..సీమను ప్రత్యేక రాష్ట్రం చేయండి  

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 08:25 AM IST
EXCLUSIVE:రాజధానులపై మైసూరా మాట : రాజధాని కర్నూలులో పెట్టండి, లేదంటే..సీమను ప్రత్యేక రాష్ట్రం చేయండి  

మూడు రాజధానుల అంశంపై ఏపీ అట్టుడికిపోతోంది. దీనిపై పలువురు నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంలో కనుమరుగైపోయిన సీనియార్ రాజకీయ నాయకుడు,మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  

రాజధానిగా అమరావతి నిర్ణయంపై తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని..ఇద్దరూ సీఎంలు రాయలసీమవాసులు అయి ఉండి రాయలసీమవాసులేనన్నారు. రాజధాని కావాలని ఉత్తరాంధ్రా వాసులు ఎప్పుడు అడగలేదనీ..రాయలసీమవాసులు మొదటినుంచి క్యాపిటల్ డిమాండ్ చేస్తున్నారనీ అడిగినవారికి ఇవ్వకుండా అడగనివారికి ఇవ్వటమేంటి  అంటూ మైసూరా ప్రశ్నించారు. విశాఖకు పాలనా రాజధాని రాయలసీమ నుంచి విశాఖకు సెక్రటేరియట్ కు వెళ్లాలంటే చాలా కష్టమని కాబట్టి సీమలోనే  రాజధాని పెట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలుని పరిపాలనా రాజధానిగా ప్రకటించాల్సిందేనని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై త్వరలోనే రాయలసీమలోని నేతలందరితో సమావేశమై..కార్యాచరణ సిద్ధం చేస్తామని మైసూరా తెలిపారు.  

తెలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానికి ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందనీ..తరువాత అది పలు కీలక పరిణామాల మధ్య తరలిపోయిందనీ..తెలంగాణ..ఏపీ విభజన తరువాత సీఎం అయిన చంద్రబాబు రాజధానిని అమరావతి అని ప్రకటించినప్పుడు రాయలసీమ వాసుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు లెక్కలేయకుండా అమరావతే రాజధాని అని ప్రకటించి నిర్మాణం కూడా ప్రారంభించారు. అలా రెండో సారి రాయలసీమకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మూడు రాజధాులు అంటున్నారు.కానీ మూడు రాజధానులు మంచిది కాదని అంటూనే చంద్రబాబు..జగన్ ఇద్దరూ సీమ వాసులే అయి వుండి రాయలసీమకు అన్యాయం చేస్తూ చంద్రబాబు అమరావతి అన్నారు.

ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక విశాఖను పాలనారాజధాని అంటున్నారనీ కానీ కర్నూలులే పరిపాలనా రాజధాని చేయాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రాయలసీమలను రాష్ట్రంగా చేయమని డిమాండ్ చేశారు. విడిపోవటానికి మేం సిద్దంగా ఉన్నామని కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు మైసూరారెడ్డి. ఇప్పుడు రాజధాని అమరావతి రైతులు భూముల్ని త్యాగం చేశాం కాబట్టి మాకు అన్యాయం జరిగిందంటున్నారు. కానీ రాజధానికే త్యాగంచేసిన మా రాయలసీమ వాసులు పరిస్థితి ఏంటి అని మైసూరా ప్రశ్నించారు.