మంత్రి క్లారిటీ : సెప్టెంబర్ నుంచి అందరికీ రూ.10వేలు

ఆశావర్కర్ల అనుమానాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. వారి అనుమానాలు తొలగించి క్లారిటీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు గ్రేడింగ్, పాయింట్ల వ్యవస్థ లేదన్నారు.

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 02:57 PM IST
మంత్రి క్లారిటీ : సెప్టెంబర్ నుంచి అందరికీ రూ.10వేలు

ఆశావర్కర్ల అనుమానాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. వారి అనుమానాలు తొలగించి క్లారిటీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు గ్రేడింగ్, పాయింట్ల వ్యవస్థ లేదన్నారు.

ఆశావర్కర్ల అనుమానాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. వారి అనుమానాలు తొలగించి క్లారిటీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు గ్రేడింగ్, పాయింట్ల వ్యవస్థ లేదన్నారు. ఎలాంటి కండీషన్స్ లేకుండా అందరికీ పెరిగిన జీతాలు(రూ.10వేలు) ఇస్తామన్నారు. పెంచిన జీతాలను ఆగస్టు నుంచి వర్తింపజేసి సెప్టెంబర్ నుంచి చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఆశావర్కర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బకాయి పడ్డ జీతాలను కూడా చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారని.. త్వరలోనే చెల్లిస్తామని మంత్రి ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం తమదని చెప్పారు. కొన్ని రాజకీయ శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఆశా వర్కర్లు వారి వలలో పడొద్దని మంత్రి సూచించారు. టీడీపీ ప్రభుత్వం చేయలేని పనిని తాము చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఆశావర్కర్ల జీతాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు(ఏకంగా 3 రెట్లు) పెంచుతూ సీఎం జగన్ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా ఆశావర్కర్ల జీతాన్ని పెంచుతానని జగన్ వారికి హామీ ఇచ్చారు. చెప్పినట్టుగా జీతాలు పెంచుతూ జూన్ 3న జీవో జారీ చేశారు. కాగా ఇంతవరకు అమలు చేయకపోవడంతో ఆశావర్కర్లు రోడ్డెక్కారు.

కొంతకాలంగా ఆశావర్కర్లు ఆందోళన బాట పట్టారు. జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపణలు చేశారు. తమకు రావాల్సిన 7 నెలల జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని, గ్రేడింగ్‌ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు వేతనాన్ని అందరికీ ఇవ్వాలన్నారు. వీరి ఆందోళనలపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. సెప్టెంబర్ నుంచి అందరికి పెంచిన జీతాలనే ఇస్తామన్నారు.