సింహం మలం డబ్బా రూ.500 : దటీజ్ లయన్ రేంజ్

  • Published By: nagamani ,Published On : August 21, 2020 / 11:58 AM IST
సింహం మలం డబ్బా రూ.500 : దటీజ్ లయన్ రేంజ్

కిలో ఆవు పేడ రూ.2లు. సాధుజంతువైన ఆవు పేడ ఖరీదు రెండు రూపాయలుంటే..అడవికి రాజు అయిన సింహం పేడ అదేనండీ..సింహం మలం ఇంకెంత ఖరీదు ఉండొచ్చు కదూ. అదేంటీ ఆవుపేడతో ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నారు..కానీ సింహం మల ఏంటీ దాన్ని అమ్మడటం ఏంటీ అని ఆశ్చర్యపోవచ్చు. కానీ సింహం మలం ఓ టిన్ ఖరీదు రూ.445 లు. అయినా అసలు సింహం మలం కోసం అడవుల వెంట పరిగెత్తాలా ఏంటీ అనుకోవచ్చు..కానీ ఈ కరోనా కాలంలో ఇటువంటి వింత విచిత్రమైన అమ్మకాలు కూడా ఉంటాయని ప్రకటిస్తున్నారు.



కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ తో విద్యా సంస్థలు, సినిమా హాళ్లతో పాటు జూ పార్కులు, సర్కసులు కూడా మూతబడ్డాయి. లాక్ డౌన్ తొలగించినప్పటికీ ప్రజలు బయటికి రావటానికే భయపడుతున్నారు. దీంతో జూలు మెయిన్ టెన్ చేయటం కష్టంగా మారింది. ఇక సర్కసుల మాట చెప్పుకోనక్కర్లేదు.

సర్కస్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్ళ పరిస్థితి దుర్భరంగా మారింది. జర్మనీలోని మునిచ్ నగరంలో ఉన్న క్రోనే అనే జూ ఈ లాక్ డౌన్ తో పూర్తిగా కుదేలైపోయింది. నష్టాలు అనే మాట చాలా చిన్నది. సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు జూలో జంతువులకు ఆహారం పెట్టటం కూడా చాలా కష్టమైపోతోంది.



దీంతో జూ యాజమాన్యం ఉద్యోగులను సమావేశపరచి భవిష్యతు కార్యాచరణపై చర్చించారు. ఈ క్రమంలో జూ నిర్వహణకు డబ్బులు ఎలా సమకూర్చుదాం అని ఓ ఉన్నతాధికారి అడిగినదానికి ఓ ఉద్యోగి సరదాగా మాట్లాడుతూ..హా ఏముంది..జూలో ఉన్న సింహాల మలాన్ని అమ్ముదాం అన్నాడు.

ఆ ఉద్యోగి సరదాగా అన్న మాటను యాజమాన్యం సీరియస్ గా తీసుకుంది. జూలోని సింహాల మలాన్ని జాడీలో పెట్టి ఒక్కో సింహం మలం జాడీని రూ.445 లకు అమ్ముతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడి ప్రజలు సింహం మలాన్ని తెగ కొనేసుకుంటున్నారట. సింహం మలానికి డిమాండ్ పెరగడంతో మలం గుర్తు(పూ ఎమోజీ)తో ప్రత్యేకంగా ఓ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సర్కస్‌లో మొత్తం 26 సింహాలు, పులులు ఉన్నాయి. ప్రజలు మాత్రం ఈ సింహం మలం జాడీలను కొనుగోలు చేసి తమ స్నేహితులకు గిఫ్టులుగా కూడా పంపిస్తూ సరదాగా ఆటపట్టిస్తున్నారట. కొందరు మాత్రం సింహం మలాన్ని ఎరువుగా వాడేందుకు కొంటున్నారట.