GHMC ELECTION : మాస్క్ ఉంటేనే ఓటు, ఎన్నికల వేళ మార్గదర్శకాలు

  • Published By: madhu ,Published On : November 19, 2020 / 04:42 AM IST
GHMC ELECTION : మాస్క్ ఉంటేనే ఓటు, ఎన్నికల వేళ మార్గదర్శకాలు

Mask compulsory : GHMC ELECTION కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. కరోనా కాలంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధికి సమగ్ర మార్గదర్శకాలను అందచేశారు. ఆ ప్రకారం..ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.



ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచించారు. నో మాస్క్ నో ఎంట్రీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, భౌతిక దూరం మస్ట్ అని వెల్లడించింది. ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.



పోలింగ్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు దృష్టి కేంద్రీకరించాలి.
ఓటర్ల మధ్య ఆరడుగుల భౌతిక దూరం ఉండాలి.
పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
మాస్క్ లేని ఓటర్లను ఓటు వేసేందుకు అనుమతించకూడదు.
పోలింగ్ అధికారి ముందు ఒక ఓటరు మాత్రమే నిలబడటానికి అనుమతినిస్తారు.



స్త్రీ, పురుషులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మూడు క్యూలు ప్రత్యేకంగా ఉండాలి.
కోవిడ్ అవగాహనకు సంబంధించిన పోస్టర్లు ఏర్పాటు చేయాలి.
సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ల కోసం పోలింగ్ స్టేషన్లలో భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఉండాలి.
ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో కలిసి ఐదుగురు వెళ్లొచ్చు.
కరోనా ప్రొటోకాల్ ప్రకారం…బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. రోడ్ షోలలో వాహనాల మధ్య 100 మీట్లర దూరం పాటించాలి.