జగన్..అమరావతిని టచ్ చేస్తే కాలుద్ది : GN Rao కమిటీ నివేదిక ఏసీ రూమ్‌లోంచి వచ్చింది ప్రజల్లోంచి కాదు

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 11:04 AM IST
జగన్..అమరావతిని టచ్ చేస్తే కాలుద్ది : GN Rao కమిటీ నివేదిక ఏసీ రూమ్‌లోంచి వచ్చింది ప్రజల్లోంచి కాదు

రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్న తుళ్లూరు రైతులకు వామపక్ష పార్టీ నేతలు మద్దతునిచ్చారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాటాలు చేసే సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులు రైతుల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నేత  నారాయణ మాట్లాడుతూ..రాజధాని అమరావతిని టచ్ చేస్తే కాలుతుంది జాగ్రత్త అంటూ సీఎం జగన్ ను హెచ్చరించారు. అమరావతి అంటే రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు రైతుల మనోభావాలు..రైతులు త్యాగం అని సీఎం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 

ఈరోజు కేబినెట్ భేటీ సందర్బంగా..కేబినెట్ లో రాజధాని అమరావతి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని..మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
హైదరాబాద్ ఏసీ రూముల్లో కూర్చుని జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ఇచ్చిందేనని అది ప్రజలను సర్వే చేసి ఇచ్చిన నివేదిక కాదని  ఈ సందర్భంగా సీపీఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. అటువంటి నివేదికను  ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు.

రాజధానిని మారుస్తామని ఇప్పుడు ప్రకటించిన జగన్ ఎన్నికల సందర్భంలో అటువంటి మాటే మాట్లాడలేదనీ అప్పుడు రైతులు ఓట్లు కావాలని అధికారం వచ్చాక ఆ రైతుల గోడు అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీపీఐ మరో నేత రామకృష్ణ మాట్లాడుతూ..సీఎం జగన్ ను ప్రశ్నించే ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీలో లేరని అన్నారు.