ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు గుడ్ న్యూస్

ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ గుడ్ న్యూస్ చెప్పారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 03:46 AM IST
ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు గుడ్ న్యూస్

ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ గుడ్ న్యూస్ చెప్పారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని

ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ గుడ్ న్యూస్ చెప్పారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండేవారు 100 చదరపు గజాలలోపు నివాసం ఉంటే వాటిని క్రమబద్దీకరణకు రూ. 1 చెల్లించాలన్నారు. 300 చదరపు గజాల కంటే ఎక్కవ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్న వారికి తమ నివాస స్థలాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరను చెల్లించి తమ స్థలాలను క్రమబద్దీకరించుకోవచ్చన్నారు.

క్యాంపు ఆఫీస్ లో ఇళ్ల స్థలాల పంపిణీ, భూసేకరణ తదితర అంశాలను అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న పేదలు వారి ఇంటి క్రమబద్దీకరణ కోసం తహసీల్దార్, గ్రామ సచివాలయాల్లో తమ దరఖాస్తులు దాఖలు చేయాలన్నారు. దీనికి సంబంధించి నవంబర్ 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఈ మంచి అవకాశాన్ని పేదలు వినియోగించుకునేలా రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కలిపించాలన్నారు. వచ్చిన  దరఖాస్తులను అధికారులు పరిశీలించి 120 రోజుల్లోగా నిబంధనల మేరకు అర్హులకు స్థలాలను క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటారన్నారు.

కృష్ణా జిల్లాలో 2లక్షల 71వేల మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్హులుగా గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం 4వేల 497 ఎకరాలు భూమి అవసరమన్నారు. ప్రస్తుతం 2వేల 132 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. మిగిలిన ప్రైవేట్ భూమిని చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి సంబందించి నవంబర్ 16వ తేదీన అన్ని మండలాల్లోను సోషల్‌ అడిట్‌  నిర్వహించి లబ్దిదారుల జాబితాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.