డాక్టర్ల నిర్వాకం : బాలింత కడుపులో దూది పెట్టి కుట్టేశారు

  • Edited By: veegamteam , November 17, 2019 / 06:50 AM IST
డాక్టర్ల నిర్వాకం : బాలింత కడుపులో దూది పెట్టి కుట్టేశారు
ad

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరోసారి గవర్నమెంట్ డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఓ బాలింత కడుపులో దూది పెట్టి కుట్లు వేసిన ఘటన జరిగింది. సదరు బాధితురాలికి కడుపు నొప్పితో హాస్పిటల్ కు రావటంతో.. డాక్టర్ల నిర్వాకం బైటపడింది. దీంతో బాధితురాలు అంజలి బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నవంబర్ 5న గర్భిణి అంజలికి డాక్టర్లు సర్జరీ చేసి..బిడ్డను తీశారు. సర్జరీ జరిగిన తరువాత అంజలిని డిశార్జ్ చేయగా ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులకు అంజలికీ తీవ్రమైన కడుపు నొప్పికి గురైంది. అంతేకాదు..తీవ్రమైన దుర్వాసతో కూడిన బ్లీడింగ్ అవ్వటంతో మరోసారి హాస్పిటల్ కు వచ్చింది. దీంతో డాక్టర్లు అంజలికీ స్కానింగ్  చేయగా..ఆమె కడుపులో దూది పెట్టి కుట్టేసినట్లుగా గుర్తించారు. ఈ విషయం  తెలిసిన ఆమె బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం అడుతున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇటువంటి ఘటనలతో ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రజలకు నమ్మకం పోయి భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. గతంలో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా వారి నిర్లక్ష్య ధోరణికి ఫుల్ స్టాప్ పడటంలేదు. ఓ పక్క ప్రైవేటు హాస్పిటల్స్ లో ప్రసవాలకు డబ్బులు చెల్లించుకోలేని పేదలు ప్రభుత్వ హాస్పిటల్ పైనే ఆధారపడాల్సి వస్తున్న క్రమంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇటువంటి ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి.