అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: vamsi ,Published On : January 22, 2020 / 09:03 AM IST
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై తీర్మానం ప్రవేశపెట్టారు హోంమంత్రి సుచరిత. చంద్రాబాబు నాయుడు పార్టీ, తెలుగు దేశం నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్సడ్డారంటూ వెల్లడించింది ప్రభుత్వం. హోంమంత్రి ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో తీర్మాణంపై చర్చ జరిగింది. రాజధాని ప్రాంతంలో 4వేల 70ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు చెబుతుంది ప్రభుత్వం.

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ సర్కార్ ఈ మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు వచ్చిన క్రమంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆధారాలతో ఉన్నవరకు చూసుకుంటే 4వేల 70ఎకరాలు తెలిశాయని, తెలియనివి ఇంకా చాలా ఉన్నాయని మంత్రి కన్నబాబు ఆరోపించారు. 

రాజధాని ప్రాంతం అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. మరోవైపు అక్రమాలు జరిగి ఉంటే విచారణ జరపాలని టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త విచారణ చేపట్టేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు  కెబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ మేరకు విచారణ జరిపిన కేబినేట్ సబ్ కమిటీ ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై నివేదిక సమర్పించారు.

కాగా ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై విచారణ బాధ్యతలను లోకాయుక్తకు అప్పగించారు. చంద్రబాబు, లోకేష్ సహా ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇప్పటికే ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిలో ముఖ్యమైన వారి పేరుతో ఆరుగురి పేర్లను కేబినెట్ సబ్ కమిటీ పొందుపరించింది.

అందులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన వేమూరు రవికుమార్, మాజీ మంత్రి నారాయణ, పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్ పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది. బీజేపీ నేత లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను పెట్టింది. వీరితోపాటు కొమ్మాలపాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారా లోకేష్, కోడెల శివప్రసాదరావు పేర్లను చేర్చింది.