ఖైదీలు పారిపోయే అవకాశం లేకుండా..కోవిడ్ ఆస్పత్రిగా మారిన గువాహటి సెంట్రల్ జైలు..

  • Published By: nagamani ,Published On : July 22, 2020 / 01:11 PM IST
ఖైదీలు పారిపోయే అవకాశం లేకుండా..కోవిడ్ ఆస్పత్రిగా మారిన గువాహటి సెంట్రల్ జైలు..

ముట్టుకోకుండానే అంటుకునే కరోనా మహమ్మారి బైట తిరగకపోయినా వస్తోంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా వైరస్‌ బారినపడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అసోం కూడా చాలా మంది ఖైదీలు కరోనా బారిన పడటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గువాహటి సెంట్రల్ జైలును కొవిడ్ ఆస్పత్రిగా మార్చేసింది.ఈ ఆస్పత్రిలో 200 పడకలను ఏర్పాటు చేశారు.

ఖైదీలో కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా చికిత్సకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఈ ఆస్పత్రిలో అందుబాటులో ఉంచారు అధికారులు. కాగా..కరోనా సోకిన ఖైదీలను బయటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పారిపోవడంతో ఈ సరికొత్త ఆలోచన చేశారు అసోం జైలు అధికారులు. దీంతో ఖైదీలు పారిపోతారనే భయం లేదంటున్నారు అధికారులు.

ఇప్పటి వరకు 481 మంది ఖైదీలకు కరోనా లక్షణాలు గుర్తించారు. దీంతో వారికి ఈ ప్రత్యేక వార్డులో చికిత్స అందించనున్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించి అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక శ్రద్ధలతో ఖైదీలకు వైద్యం చేయిస్తున్నామని వారికి సంబంధించిన బంధువులు ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

కాగా..గత కొన్ని రోజుల క్రితం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడిన అఖిల్ గొగోయ్ అతని సభ్యులు, మణిపూర్ ఉగ్రవాద నాయకులు కూడా గువాహటి సెంట్రల్ జైలులో ఉన్నారు. వారికి పరీక్షలు చేయగా అఖిల్ గొగోయ్ తో పాటు అతని సభ్యుల్లో కొందరికి పాజిటివ్ రావటంతో వారికి ఇక్కడే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఇటీవల కొంత మంది వైరస్ బారిన పడటంతో గువాహటిలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరు ఖైదీలు పారిపోవడంతో అధికారులు పటిష్ట చర్యల్లో భాగంగా గువాహటి జైలునే కోవిడ్ ఆస్పత్రిగా మార్చేశారు.