కీలక దశకు హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ : మరణ శిక్ష విధించాలన్న పీపీ

హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి.

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 01:36 AM IST
కీలక దశకు హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ : మరణ శిక్ష విధించాలన్న పీపీ

హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి.

హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కూడా శ్రీనివాస్‌ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కోర్టుకు వివరించారు. నిందితుడి తరఫున డిఫెన్స్ న్యాయవాది వాదనలు వినిపించారు. హాజీపూర్‌ వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డికి.. ఈ కేసుతో అసలు సంబంధమే లేదంటూ వాదించారు డిఫెన్స్‌ లాయర్. శ్రీనివాస రెడ్డిని ఇరికించడం వెనక రియల్‌ ఎస్టేట్‌ కుట్ర దాగుందని వాదించారు. కాగా శ్రీనివాస్ రెడ్డికి ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం విస్మయానికి గురిచేసింది. అదీగాక సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి మంచివాడంటూ న్యాయవాది వాదించడంతో బాధిత కుటుంబీకులు షాక్ అయ్యారు. 

బాలికలు హత్యకు గురైన రోజు శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లిలో ఉన్నట్లు డిఫెన్స్ లాయర్ ఠాగూర్ వాదించారు. అతనికి బైక్ నడపడం రాదని.. సిమ్ కార్డులు ఉపయోగించిన్లు కూడా ఆధారాలు లేవన్నారు. బొమ్మలరామారంలో బాలికను చూసిన మహిళ వేర్వేరుగా స్టేట్ మెంట్ ఇచ్చిందని.. బాలికను చివరగా వదిలేసిన ఆటో డ్రైవర్ ను పోలీసులు ఎందుకు అనుమానించలేదని ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డితో భూ తగాదాలు ఉన్న కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడంతోనే అరెస్ట్ చేశారని న్యాయవాది తెలిపారు. 

కర్నూలులో మహిళ హత్య కేసు కావాలనే పెట్టారని డిఫెన్స్ లాయర్ చెప్పుకొచ్చారు. అసలు శ్రీనివాస్ రెడ్డికి స్మార్ట్ ఫోన్ లేదని.. అలాంటప్పుడు పోర్న్ ఎలా చూస్తారని ప్రశ్నించారు. బాలికల లోదుస్తులపై నిందితుడి రక్తపు ఆనవాళ్లు అనేది కట్టుకథన్నారు. ఇవన్నీ పోలీసులే సృష్టించారని డిఫెన్స్ లాయర్ వాదించారు. 

అయితే.. డిఫెన్స్ వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ తిప్పికొట్టారు. స్మార్ట్ ఫోన్ నిందితుడిది కానప్పుడు.. అందులో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ డేటా ఎలా రిట్రీవ్ అయ్యిందని ప్రశ్నించారు. సర్వర్ నుండి రిట్రీవ్ చేసిన డేటా సృష్టించడానికి కుదరదని చెప్పారు. ఘటన జరిగిన రోజు అతని సిమ్ కార్డులు ఇంట్లో ఉన్నట్లు నిందితుడు అంగీకరించారని తెలిపారు. విచారణ జాప్యం చేసేందుకే నిందితుడు కట్టుకథలు చెబుతున్నారని కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని.. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరువైపులా వాదనలను విన్న న్యాయస్థానం కేసు విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.