ఏపీలో కొత్త రూల్ : బైక్‌పై ఇద్దరూ హెల్మట్ పెట్టుకోవల్సిందే

  • Published By: veegamteam ,Published On : February 18, 2020 / 07:52 AM IST
ఏపీలో  కొత్త రూల్ : బైక్‌పై ఇద్దరూ హెల్మట్ పెట్టుకోవల్సిందే

బైక్ పై ప్రయాణించే ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రమాదం జరిగిప్పుడు వెనుక వ్యక్తి మరణించే ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం బైక్‌పై ప్రయాణంచేవారు ఇకపై ఇద్దరు హెల్మెట్ ధరించాలనే నిబంధన తీసుకుని వచ్చింది ఏపీ ప్రభుత్వం. వాటి పై ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం పోలీసులు విశాఖ నగరంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరంలో ఇటువంటి రూల్ అమలులో ఉండగా.. ఏపీలో అందులోనూ విశాఖ నగరంలో కొత్తగా అమలులోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం. గతేడాది నగరంలో ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ఐదుగురు మరణించారని, కొంతమంది గాయపడ్డారని రని రికార్డులు చెబుతున్నాయి. హెల్మెట్ ధరించి ప్రయాణించటం వల్ల  ప్రమాదాలను అరికట్టవచ్చు. అయితే వెనుక వ్యక్తికి హెల్మెట్ లేకపోవడంతో ప్రమాదంలోచనిపోయేవారి సంఖ్య పెరుగుతుంది. 

బైక్‌పై ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి ప్రయాణించటం అనేది కొత్త నిబంధన కాదు. గతంలో కూడా బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో పాలిటన్ సిటీల్లో దీనిని అమలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

ఇప్పుడు విశాఖ నగరంలో కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు ప్లాన్ చస్తున్నారు పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా. ఈ నిబంధనపై తీవ్రంగా కృషి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ప్రధాన జంక్షన్ లో ఉంచినట్లు రాజు అనే అధికారి వెల్లడించారు.