హైదరాబాద్ ఎప్పుడు వదిలేశారబ్బా : కర్నూలు ఓటరు జాబితాలో హీరో వెంకటేష్

టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ఎక్కడుంటారు? అంటే... తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. హైదరాబాద్ లో నివాసం ఉండే వెంకటేష్ కు

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 12:26 PM IST
హైదరాబాద్ ఎప్పుడు వదిలేశారబ్బా : కర్నూలు ఓటరు జాబితాలో హీరో వెంకటేష్

టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ఎక్కడుంటారు? అంటే… తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. హైదరాబాద్ లో నివాసం ఉండే వెంకటేష్ కు

టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ఎక్కడుంటారు? అంటే… తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. హైదరాబాద్ లో నివాసం ఉండే వెంకటేష్ కు నగరంలోనే ఓటు హక్కు కూడా ఉంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ.. చిత్రంగా.. ఏపీలోని కర్నూలు ఓటరు జాబితాలో వెంకటేష్ ఫొటో కనిపించింది. దీంతో స్థానికులు షాక్ అయ్యారు. వెంకటేష్.. హైదరాబాద్ వదిలి.. కర్నూలు ఎప్పుడొచ్చారు? ఆయనకు ఓటు హక్కు ఎప్పుడొచ్చింది అనే ప్రశ్నలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

అసలేం జరిగిందంటే.. కర్నూలు నగర పాలక సంస్థ రిలీజ్ చేసిన ఓటర్ లిస్టులో హీరో వెంకటేష్ ఫోటో ప్రత్యక్షమైంది. దీంతో అంతా కంగుతిన్నారు. వాస్తవానికి.. ఓ మహిళ బదులు హీరో వెంకటేష్ ఫోటో ప్రింట్ అయ్యింది. ఈ ఫోటో చూసి షాక్ తిన్న అధికారులు తప్పు జరిగిందని గమనించారు. దాన్ని సరిదిద్దుకునే పనిలో పడ్డారు.

కర్నూలు నగర పాలక సంస్థ ఓటర్ లిస్టుని రిలీజ్ చేసింది. అందులో మహిళా ఓటర్ కు బదులుగా సినీ నటుడు వెంకటేష్ ఫోటో వచ్చింది. నగరంలోని 31వ వార్డులో మహిళలకు సంబంధించిన వివరాలు సరిగానే ఉన్నాయి. కానీ ఫోటో మాత్రం మారిపోయింది. కర్నూలులోని 31వ వార్డులో ఓటరు పేరు రాణి కూమరోలూ అని ఉంది. తండ్రి / భర్త పేరు బాలు కూమరొలూ. ఇంటి నెంబర్ 83/54a. వయసు 20 సంవత్సరాలు. లింగము : స్త్రీ అని రాసి ఉంది. అయితే, పక్కన ఫొటో మాత్రం వెంకటేష్ ది ఉంది. ఆ ఓటర్ కార్డు నెంబర్ ZGF3524139. 

ఈ తప్పును గమనించిన కొందరు వెంటనే అధికారులను సంప్రదించారు. దీంతో స్పందించిన అధికారులు తప్పుని సరిదిద్దే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే మరో చోట ఓటర్ ఫోటో బదులు కుక్క ఫోటో ప్రింట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. జాబితాలో మరికొన్ని తప్పులు దొర్లాయని.. వాటిని కూడా త్వరలోనే సరిచేస్తామని అధికారులు వివరించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదన్నారు.

ఎలక్షన్ కమిషన్‌ రిలీజ్ చేసే ఓటర్ జాబితాల్లో కొన్ని సార్లు భయంకరమైన తప్పులు దొర్లుతూ ఉంటాయి. ఇది కామన్. అలాంటిదే ఇది కూడా అంటున్నారు. ఓటర్ లిస్టులో ఫొటోలు అప్‌ లోడ్ చేసే సమయంలో అధికారులు, సిబ్బంది చేసే పొరపాట్లతో ఇలాంటి చిత్ర విచిత్రాలు, తప్పిదాలు జరుగుతున్నాయి.