సంక్రాంతి కోడిపందేలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సంక్రాంతి కోడిపందేలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సంక్రాంతి కోడిపందేలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సంక్రాంతి వస్తుందంటే.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో హడావుడి విపరీతంగా ఉంటుంది. గోదావరి జిల్లాల్లో కోడిపందేల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడిపందేలు వరల్డ్ వైడ్ ఫేమస్. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కోడిపందేలకు వస్తుంటారు. అయితే వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ కోర్టులు ఆదేశాలుడ ఇస్తూనే ఉన్నాయి.

అ క్రమంలోనే పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఆదేశించింది హైకోర్టు చెప్పింది. కోడిపందేల నియంత్రణపై 2016లో ఉమ్మడి హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అధికారులు సరిగ్గా అమలు చేయట్లేదని హైకోర్టు ఆరోపించింది. 

ఈ క్రమంలో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ముందు విచారణ జరగగా.. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి కోడిపందేలు జరగకుండా పర్యవేక్షిస్తున్నట్లు కోర్టుకు ప్రభుత్వం వివరించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

×