ఓట్ల సర్వే చిచ్చు : యర్రావారిపాలెంలో హై టెన్షన్

  • Published By: madhu ,Published On : February 23, 2019 / 10:56 AM IST
ఓట్ల సర్వే చిచ్చు : యర్రావారిపాలెంలో హై టెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు యమ రంజుగా సాగుతున్నాయి. ఓట్ల నమోదు..తొలగింపుపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలు ఇతరుల చేత సర్వేలు జరుపుతూ తమ పార్టీకి చెందిన వారివి..సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవలే సర్వే నిర్వహిస్తున్న వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా తిరుపతిలోని యర్రావారిపాలెంలో ఇలాంటిదే చోటు చేసుకుంది.

చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో యర్రావారిపాలెం మండల కేంద్రంలోని ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం కొంతమంది యువకులు ట్యాబ్‌లతో వచ్చి పలువురితో మాట్లాడుతుండడం స్థానికులు గమనించారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వేణుగోపాల్ రెడ్డి అక్కడకు చేరుకుని వారిని నిలదీశారు. వారు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ట్యాబ్‌లను వేణుగోపాల్ రెడ్డి లాక్కొన్నాడు. ఫాం  7 నింపి ఓట్లను తొలగిస్తున్నారని, ట్యాబ్‌ను ఎన్నికల సంఘానికి ఇస్తామని వేణుగోపాల్ రెడ్డి పేర్కొంటూ వెళ్లిపోయారు. యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారు. 
Read Also: వాళ్లకు వ్యతిరేకం కాదు.. కశ్మీర్ కోసమే చేస్తున్నా: మోడీ

ఫిబ్రవరి 23వ తేదీ శనివారం ఎమ్మెల్యె చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు యర్రావారిపాలెం పీఎస్‌కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేణుగోపాల్ రెడ్డిని రిలీజ్ చేయాలంటూ పీఎస్ ఎదుటే బైఠాయించారు. దీనితో పరిస్థితి కొంత ఉద్రిక్తతంగా మారింది. సర్వేల పేరిట టీడీపీ నేతలు ఓట్లు తొలగిస్తున్నరాంటూ ఆరోపించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఓటర్ జాబితాలో ఏకంగా 65 లక్షల దొంగ ఓట్లు చేర్చిందని కంప్లయింట్ ఇచ్చారు. తరువాత గవర్నర్‌ను కూడా కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. 
Read Also: కాంగ్రెస్ గో బ్యాక్: బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ