వైసీపీ షాకింగ్ డెసిషన్ : హిందూపురం బరిలో గోరంట్ల మాధవ్ భార్య

హిందూపురం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారనున్నారు. మాజీ సీఐ గోరంట్ల మాధవ్ ను బరిలోకి దించిన జగన్.. ఇప్పుడు అతని భార్యకు బీఫామ్ ఇస్తున్నారు.

  • Published By: vamsi ,Published On : March 23, 2019 / 06:00 AM IST
వైసీపీ షాకింగ్ డెసిషన్ : హిందూపురం బరిలో గోరంట్ల మాధవ్ భార్య

హిందూపురం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారనున్నారు. మాజీ సీఐ గోరంట్ల మాధవ్ ను బరిలోకి దించిన జగన్.. ఇప్పుడు అతని భార్యకు బీఫామ్ ఇస్తున్నారు.

హిందూపురం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారనున్నారు. మాజీ సీఐ గోరంట్ల మాధవ్ ను బరిలోకి దించిన జగన్.. ఇప్పుడు అతని భార్యకు బీఫామ్ ఇస్తున్నారు. సోమవారం సవిత ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేయనుంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలను ఆదేశించారు జగన్. గోరంట్ల మాధవ్ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని.. అభ్యర్థి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు నేతలకు.
Read Also : నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం

గోరంట్ల మాధవ్ ను ఎందుకు మార్చుతున్నారు?
గోరంట్ల మాధవ్ స్వచ్చంధ పదవీ విమరణ చేశారు. ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయటంలో ఆలస్యం జరిగింది. ప్రభుత్వం అంగీకరించలేదు. హైకోర్టు, ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు మాధవ్. తీర్పు అనుకూలంగా వచ్చింది. కోర్టు ఆదేశాలతో స్వచ్ఛంధ పదవీ విరమణను అంగీకరించిన పోలీస్ శాఖ.. రిలీవింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేదు. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం. ప్రభుత్వ ఆఫీసులకు సెలవు. ఇక సోమవారం ఒక్క రోజే మిగిలి ఉంది. ఇక వేళ సోమవారం కూడా రిలీవింగ్ లెటర్ రాకపోతే.. అతను నామినేషన్ వేయటానికి అనర్హుడు. అప్పుడు పార్టీ అభ్యర్థి లేకుండా పోతారు.

ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన జగన్.. మాధవ్ భార్య సవితను బరిలోకి దించుతున్నారు. ముందుజాగ్రత్తగా ఆమెకు బీఫాం ఇస్తున్నారు. మార్చి 25వ తేదీ సోమవారం రిలీవింగ్ లెటర్ ఎప్పుడు ఇస్తారు అనే టైం విషయంలో కూడా క్లారిటీ లేదు. నామినేషన్ దాఖలుకు సమయం 3 గంటల వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం మాత్రం 5 గంటలకు లెటర్ ఇచ్చే సమయం ఉంటుంది. దీంతో ముందు జాగ్రత్తగా గోరంట్ల మాధవ్ భార్య సవితను బరిలోకి దించుతున్నారు.
Read Also : ఎన్నికలకు మరో ఇరవై రోజులే : మేనిఫెస్టో రిలీజ్ చేయని టీడీపీ, వైసీపీ