‘వంద’ఉండాల్సిందే : HMDA పరిధిలో లే-అవుట్లకు..కొత్త జీవో

  • Published By: nagamani ,Published On : July 9, 2020 / 11:04 AM IST
‘వంద’ఉండాల్సిందే : HMDA పరిధిలో లే-అవుట్లకు..కొత్త జీవో

HMDA పరిధిలో లే-అవుట్లకు పర్మిషన్ లభించాలనే
ఇక నుంచి వంద ఫీట్ల అప్రోచ్‌ రోడ్డు ఉండాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు.లేకుంటే ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చేది లేదని తెలిపారు.ఇప్పటికే లే-అవుట్‌ అయి ఉన్న 100 అడుగులకు తక్కువగా రోడ్డు వదిలి ఉండి ఉంటే వాటినికి అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో 106ను విడుదల చేసింది.

ప్రతీ ఏటా నగరం విస్తరిస్తుండటం..పెరుగుతున్న ట్రాఫిక్ తో వంద అడుగుల అప్రోచ్ రోడ్డు ఉండాలని ప్రభుత్వం ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకుంది. అదే క్రమంలో నగర వ్యాప్తంగా నగర శివార్లలోను లే-అవుట్లు విస్తృతంగా వెలుస్తుండటంతో వాటిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వాటికి స్వస్తి పలికింది.
HMDA పరిధిలో ప్రస్తుతం ఓపెన్‌ ప్లాట్ల లే-అవుట్లకు 30 అడుగుల వరకు, గేటెడ్‌ కమ్యూనిటీ లకు లే-అవుట్‌కు 40 అడుగుల వరకు అప్రోచ్‌రోడ్డు ఉండాలనే నిబంధన గతంలో ఉండేది. కానీ ఇప్పుడలా కుదరదు. 100 అడుగుల అప్రోచ్ రోడ్డు ఉండాల్సిందేనంటోంది.

ఇప్పటికే పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నవారికి కూడా ఈ 100 అడుగుల అప్రోచ్ రోడ్డు నిబంధన వర్తిస్తుంది. రోడ్డు.. వంద అడుగులకు తగ్గిఉంటే..దానికి సరిపడా స్థలాన్ని చూపించాల్సి ఉంటుంది. అప్పుడే లే అవుట్‌కు పర్మిషన్ లభిస్తుంది. రోడ్డు డెవలప్ మెంట్ కోసం అదనపు చార్జీని కూడా వారు చెల్లించాల్సిందే.గతంలో డ్రాఫ్ట్‌ లే-అవుట్‌ తీసుకొని ఫినిషింగ్ పర్మిషన్ ఇచ్చే లే-అవుట్లకు ఈ జీవో నుంచి ఉపశమనం లభించనుంది.

Read Here>>ఇకపై ఫాంహౌస్ నుంచి పరిపాలన సమీక్షలు, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం