చంద్రబాబుపై ఫైర్ అయిన హోం మంత్రి సుచరిత

చంద్రబాబుపై ఫైర్ అయిన హోం మంత్రి సుచరిత

టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని హోం మంత్రి సుచరిత అన్నారు. ‘ర్యాలీ గురించి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ కాకుండా వేరే రూట్ లో వెళ్లాలని టీడీపీ నేతలు ప్రయత్నించారు. అలజడి సృష్టించి ప్రజల్లో భయానక వాతావరణం కల్పించాలని ఇలా చేశారు. 

రాజధాని ఏర్పాటు చేసినప్పుడు ఎవరి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే అఖిలపక్ష నిర్ణయం తీసుకోలేదు. రైతుల భూములను అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాలు బాగుపడాలి. ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఏఏ కార్యాలయాలనుక ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే చర్చిస్తున్నాం. ఆందోళన జరుగుతున్న సమయంలో చనిపోయినవారంతా గుండెపోటుతో మరణించినట్లు ఆధారాలున్నాయి’ అని హోం మంత్రి సుచరిత అన్నారు.  

ఇదిలా ఉంటే, ఆందోళనచేస్తున్న మాజీ సీఎం చంద్రబాబును పోలీసులు అరెస్టుచేశారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆటోనగర్ వద్దకు బస్సులను ప్రారంభించటానకి పాదయాత్రగా బయలు దేరిన చంద్రబాబును, వామపక్షనేతలను, జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, వెంటనే వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు.

తాము మాత్రం బస్సులు నిలిపివేసిన ప్రాంతానికి వెళతామని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం అనుమతినివ్వకపోవడంతో బాబు రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.