కనిపించని నాలుగో సింహం ‘దిశ చట్టం’ : మంత్రి పుష్ప శ్రీవాణి

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 07:00 AM IST
కనిపించని నాలుగో సింహం ‘దిశ చట్టం’ : మంత్రి పుష్ప శ్రీవాణి

దిశ చట్టం బిల్లు-2019ను హోంమంత్రి సుచరిత ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహిళలపై అత్యాచారానికి పాల్పడితే 21 రోజుల్లోగా ఉరి శిక్ష పడాలనే ఇటువంటి చారిత్రాత్మక దిశ చట్టానికి సంబంధించిన బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్టటం నా అదృష్టంగా భావిస్తున్నాననీ..ఇటువంటి అవకాశం నాకు దక్కింనందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.   

’దిశ చట్టం బిల్లు’పై మంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. కనిపించని నాలుగో సింహమే ‘దిశ చట్టం’ అని ధీమా వ్యక్యం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ చాలా పటిష్టమనదనీ..కానీ దిశ ఘటన తరువాత ఆడవారి భద్రతపై భయాందోళనలకు కలుగుతున్నాయనీ అన్నారు. ఈ క్రమంలో ఆడవారి భద్రతకు భరోసానిచ్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకువచ్చేందుకు చేస్తున్న చర్యలు యావత్ మహిళాలోకానికి భద్రతనిస్తుందని తామంతా భావిస్తున్నామని అన్నారు. 
అత్యాచారం ఘటనలో 21 పనిదినాల్లో నిందితుడు దోషిగా నిరూపించబడం వంటి పలు కీలక ఘట్టాల్నీ పూర్తైన తరువాత దోషిగా తేలటం..ఇలా అన్నీ 21 రోజుల్లో అఘాయిత్యాలకు పాల్పడినవారికి ఉరిశిక్ష పడేలా దిశ చట్టం రూపొందించేందుకు సీఎం జగన్ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయించటం..దాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఐదవ రోజు హోంమత్రి సుచరిత దిశ చట్టం బిల్లును ప్రవేశ పెట్టారు. 

ఈ సదర్బంగా గతంలో అత్యాచార ఘటనలల్లో విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నాలుగు నెలల్లో పూర్తి కావాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సీఎం జగన్ ప్రభుత్వం మరింతగా కుదించి…మూడు వారాల్లోగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి 21 రోజుల్లో ఉరి శిక్షపడాలని మార్పులు చేశారు. దీనికి సంబంధించి దిశ చట్టం బిల్లును హోమంత్రి సుచరిత ప్రవేశ పెట్టగా..ఈ బిల్లుపై మాట్లాడిన మరో మహిళా మంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ..దిశ చట్టం కనిపించని నాలుగో సింహంలా మారి మహిళలకు కాపాడుతుందని ధీమా వ్యక్తంచేశారు.