మీ కుక్కకు ఎంత తెలివి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా..

మీ కుక్కకు ఎంత తెలివి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా..

Dog: ఇంట్లో పెంపుడు జంతువులు మీరు చెప్పినట్లు వింటున్నాయా.. ఎంత వరకూ మీ మాటలను అర్థం చేసుకోగలుగుతున్నాయి. మీరు సరిగ్గానే చెప్తున్నారా.. లేదా వాటికి ఉన్న తెలివి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. రండి ఓ లుక్కేద్దాం..

గత స్టడీల్లో చింపాజీలు, సముద్ర సింహాలు, రీసస్ కోతులపై పరిశోధనలు జరిగాయి. ప్రస్తుత జర్నల్ లో మాత్రం కుక్కలపై జరిగింది. ఇందులో మనుషుల నుంచి నాలుగు సార్లు వినగానే కుక్కలు ఆ వస్తువు గురించి తెలుసుకుంటాయని వెల్లడైంది. ఈ సామర్థ్యం అనేది కుక్కలన్నింటిలో ఒకేలా ఉండదని స్టడీలో తేలింది.

ట్రైనింగ్ పొందిన కొన్నింటిలో మాత్రమే టాలెంటెడ్ గా ఉంటాయని.. అంటే మీ కుక్కకు ఎంత టాలెంట్ ఉందో.. దానికి తెలివి ఎంత ఉందో తెలుసుకోండి..

మీరు నిర్వహించాలనుకునే ఈ స్టడీ చాలా ఈజీ. ఇంట్లో కూడా చేయొచ్చు. చెప్పిన పేర్లను ఎంత త్వరగా నేర్చుకుంటుందనేది గమనించండి. కొత్త స్టడీలో విస్కీ అనే 59పేర్లు తెలిసిన కుక్క.. 42 బొమ్మల పేర్లు తెలిసిన విక్కీ నీనా అనే కుక్క పాల్గొన్నాయి. వాటి పేర్లు చెప్పి తీసుకురమ్మని యజమానులు ఆదేశిస్తుంటే అవి పట్టుకొస్తున్నాయి.

అప్పుడు రీసెర్చర్లు మరో రెండు కొత్త వస్తువులు యాడ్ చేశారు. మరోసారి యజమానులు తీసుకురమ్మని చెప్తే విస్కీ తీసుకొస్తుంది కానీ, విక్కీ మాత్రం సరిగా అర్థం చేసుకోలేకపోయింది. ఈ సారి విక్కీకి అలవాటైన బొమ్మల్లో కొత్త బొమ్మలు యాడ్ చేసి చూశారు. వాటి పేర్లు చెప్పి తీసుకురమ్మంటే విస్కీ అనే కుక్క తీసుకుంటుంది కానీ విక్కీ సరిగా రిసీవ్ చేసుకోలేకపోయింది.

చాలా సార్లు పిలిచేంత వరకూ తీసుకురాలేకపోయాయి. ఇదే ప్రోసెస్ ను మిగిలిన 20కుక్కలపై చేసేసరికి అవి కరెక్ట్ గానే పనిచేశాయి. దీనిని బట్టి కొత్త పేర్లను నేర్చుకోవడంలో అన్ని కుక్కలకు ఒకే సామర్థ్యం ఉండదనేది కన్ఫామ్ అయింది. తెలివైనవి మూణ్నాలుగు సార్లు చెప్పగానే అర్థం చేసుకున్నాయి మిగిలినవి మాత్రం తికమకపడిపోయాయి. మరి మీ ఇంట్లో కుక్కపై ప్రయోగం చేసి మీరూ తెలుసుకోవాలంటున్నారా..