భార్య మృతికి కారణమైన భర్తకు పదేళ్ల జైలు

భార్య మృతికి కారణమైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ఐదో అదనపు సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 03:41 PM IST
భార్య మృతికి కారణమైన భర్తకు పదేళ్ల జైలు

భార్య మృతికి కారణమైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ఐదో అదనపు సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు.

ఆయన కావాలని చేయలేదు. ఏదో పొరపాటున జరిగిపోయింది. మద్యం మత్తులో తెలియకుండానే జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందుకే ఆయనకు శిక్ష పడింది. 

భార్య మృతికి కారణమైన భర్త కేసులో జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. భార్య మృతికి కారణమైన ఆ భర్తకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం 5వ అదనపు సెషన్స్ జడ్జి తీర్పిచ్చారు. వివరాల్లోకి వెళితే.. ముత్యాలు, విజయ్ దంపతులు. పదేళ్ల క్రితం వివాహమైంది. 2012 జనవరి 9న ఫుల్లుగా మద్యం తాగిన విజయ్ చిన్నిమిడిసిలేరు దగ్గర కిందపడిపోయాడు.

భార్య ముత్యాలు, ఆమె తల్లి, ఇతర బంధువులు విజయ్ ని ఆటోలో తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో విజయ్‌ తన భార్య ముత్యాలును తన్నాడు. దీంతో ముత్యాలు ఆటోలో నుంచి రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం భద్రాచలం నుంచి ఖమ్మంకి అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా ఆమె చనిపోయింది.

దీనిపై 2012 జనవరి 10న ముత్యాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 13 మంది సాక్షుల విచారణ తర్వాత నేరం రుజువైంది. దీంతో విజయ్ కి పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.