కాంగ్రెస్ కంచుకోట బద్దలు : 21 వేల ఓట్ల ఆధిక్యం..దూసుకుపోతున్న సైదిరెడ్డి

  • Published By: madhu ,Published On : October 24, 2019 / 06:17 AM IST
కాంగ్రెస్ కంచుకోట బద్దలు : 21 వేల ఓట్ల ఆధిక్యం..దూసుకుపోతున్న సైదిరెడ్డి

కాంగ్రెస్ కంచు కోటను కారు ఢీ కొట్టింది. కారు జోరుకు కాంగ్రెస్ కందిపోయింది. రౌండు రౌండుకీ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి సై అంటూ దూసుకుపోతున్నాడు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల కౌంటింగ్ పూర్తికాక ముందే ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయిపోయారు. హుజూర్ నగర్ లో ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇకపై ఓ లెక్క అన్నట్లుగా టీఆర్ఎస్ నేతలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. 

11వ రౌండ్ ముగిసే సరికి 21 వేల 467 ఓట్ల ఆధిక్యంలో సైదిరెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల 779 ఓట్లు, సమీప కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి 32 వేల 196, బీజేపీ అభ్యర్థి రామారావు 1026, టీడీపీ అభ్యర్థి కిరణ్మయి 731 ఓట్లతో ఉన్నారు. 

మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ మీద పడుతుందని మొదట అనుకున్నప్పటికీ ఆ ప్రభావం ఏ మాత్రం ఎన్నికలపై కనిపించలేదు. రౌండ్‌ రౌండ్‌కు పెరుగుతున్న సైదిరెడ్డి మెజార్టీ పెరుగుతోంది. మరోవైపు.. గ్రూపు గొడవలు కాంగ్రెస్‌ను దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె, టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలను సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  ఇవన్నీ ఒక ఎత్తయితే.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సిట్టింగ్‌ స్థానమే చేజారుతుండటం.. హస్తానికి ఆందోళన కలిగిస్తోంది. 

ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పలు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించగా. అన్ని ఫలితాలూ అధికార టీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే వచ్చాయి. దానికి తగినట్లుగానే ఇప్పుడు రిజల్ట్ వస్తున్నాయి.
Read More : హుజూర్ నగర్ కౌంటింగ్ అప్ డేట్ : 17 వేల 400 ఓట్ల