హుజూర్ నగర్ ఉప ఎన్నిక : 119 నామినేషన్లు దాఖలు

  • Published By: madhu ,Published On : September 30, 2019 / 10:49 AM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక : 119 నామినేషన్లు దాఖలు

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలు గడువు సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 3 గంటలకు క్లోజ్ చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు అనేక మంది తమ నిరసనను తెలియచేసేందుకు నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 119 నామినేషన్లు దాఖలయ్యాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సీపీఐ దూరంగా ఉంది. ఈ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనేది తెలియరాలేదు. టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా లేదా అనేది కొద్దిగంటల్లో తెలియనుంది. 

పార్టీ  అభ్యర్థి
టీఆర్ఎస్ సైదిరెడ్డి
కాంగ్రెస్ పద్మావతి
బీజేపీ కోట రామారావు
టీడీపీ కిరణ్మయి
సీపీఎం పారేపల్లి శేఖర్ రావు

టీఆర్ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో సైదిరెడ్డి పోటీ చేశారు. కేవలం 7 వేల ఓట్లతో ఆయన పరాజయం చెందారు. అన్ని ప్రధాన పార్టీలు గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నాయకుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్లగొండ ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. తదనంతరం హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉత్తమ్‌ రాజీనామా చేశారు. దీంతో హుజుర్‌నగర్‌ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలో అక్టోబర్‌ 21వ తేదీన హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అక్టోబర్ 21న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 24వ తేదీన జరిగే కౌంటింగ్‌లో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి. 
Read More : హైదరాబాద్ లో కుండపోత వర్షం : రోడ్లు జలమయం