మొక్కలు తిన్న మేకలు : రూ.3వేలు ఫైన్

తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కోట్ల సంఖ్యలో మొక్కలను నాటారు. వాటిని కంటికి

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 08:16 AM IST
మొక్కలు తిన్న మేకలు : రూ.3వేలు ఫైన్

తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కోట్ల సంఖ్యలో మొక్కలను నాటారు. వాటిని కంటికి

తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కోట్ల సంఖ్యలో మొక్కలను నాటారు. వాటిని కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. హరిత హారంలో భాగంగా నాటిన మొక్కలను టచ్ చేసినా ఊరుకోవడం లేదు. వాటిని పాడు చేస్తే కేసులు నమోదు చేసి ఫైన్లు వేస్తున్నారు.

తాజాగా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తినడంతో ఆ మేకల యజమానికి జరిమానా విధించారు. మున్సిపాలిటీ అధికారులు మేకల యజమానికి రూ. 3వేలు జరిమానా విధించారు. అంతేకాదు.. మేకలు ఎన్ని మొక్కలు పాడు చేశాయో అన్ని మొక్కలను తిరిగి నాటాలని ఆదేశించారు. సిద్ధిపేటలోని స్థానిక ఎల్లమ్మ ఆలయం పరిసరాల్లో ఈ ఘటన జరిగింది.

సిద్ధిపేటకు చెందిన కిషన్ కి చెందిన మేకలు హరితహారం మొక్కలు తిన్నాయి. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. జరిమానాకు సంబంధించిన రశీదును కిషన్ కు ఇచ్చారు. సిద్ధిపేట మున్సిపాలిటీ అధికారులు ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశారు. 87వేల 100 రూపాయలు ఫైన్ వసూలు చేశారు.