రచ్చలేపుతున్న హైదరాబాదీ కార్ల వైభోగం.. రోల్స్ రాయ్స్, బెంజ్, లంబోర్గిని..

10TV Telugu News

Hyderabad man: ఇండియాలోని అత్యంత ఖరీదైన కార్ల ఓనర్లలో హైదరాబాదీ నజీర్ ఖాన్ ఒకరు. రోల్స్ రాయ్స్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఫెర్రారీ, లంబోర్గినీ, ఫోర్డ్ లాంటి అద్భుతమైన కలెక్షన్లు అతని వద్ద మెరిసిపోతున్నాయి. ఇవన్నీ ఒకేచోట అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చూస్తుంటే మతిపోవడం ఖాయం. ప్రస్తుతం అత్యంత ఖరీదుతో పాటు లేటెస్ట్ ఎడిషన్ అయిన Rolls Royce Cullinan SUV Black Badgeతో రీసెంట్ గా ఓ వీడియో పోస్టు చేశాడు.

Rolls Royce Cullinan Black Badge
దీని ఖరీదు రూ.6.95కోట్ల నుంచి స్టార్ట్ అవుతుండగా బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ రూ.8.20కోట్ల నుంచి మొదలవుతుంది. ఇందులో మరేదైనా కస్టమైజేషన్ ఉంటే మాత్రం ధర మరింత పెరిగే అవకాశముంది. ఇక ఈ కారు అణువణువు వర్ణించి చెప్పాలంటే అద్భుతం.. మహాద్భుతమంటే సరిపోదూ..

rolls royce balck badge

rolls royce balck badge

Ferrari 812 Superfast
పేరులోనే ఉంది సూపర్ ఫాస్ట్ కారు అని. రెడ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ తో ఉన్న కారుకు బ్లాక్ అల్లోయ్ వీల్స్ తో పాటు మధ్యలో బ్లాక్ లైన్ పోతూ రేసింగ్ కు రెడీ అంటూ కన్నుకొడుతున్నట్లుంది. దీని ప్రారంభ ధర రూ.5.75కోట్లు.

Naseer-ferrari

Naseer-ferrari

Mercedes-Benz G350d
మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ ప్రపంచంలోనే గుర్తుండిపోయే కార్ మోడల్స్ లో ఒకటి. షోరూం బయటి ధర రూ.1.55కోట్లు.

Naseer-G350d

Naseer-G350d

Ford Mustang
అమెరికన్ మజిల్ కార్లలో స్పెషల్ ఎస్యూవీ ఇదే. కాకపోతే ఈ మోడల్ ఇంకా ఇండియాలో లాంచ్ అవలేదు.

Ford Mustang

Ford Mustang

Lamborghini Aventador
ప్రపంచంలోని అత్యంత అందమైన కార్లలో అవెంతడార్ ఒకటి. దీని ధర ఇండియాలో రూ.5కోట్ల నుంచి మొదలవుతుంది. పెట్రోల్ ఇంజిన్ తో రయ్ రయ్ మనే శబ్ధం మాంచి కిక్ ఇస్తుంది.

naseer-aventador

naseer-aventador

Lamborghini Urus
లాంబోర్గినీ మరో స్పోర్ట్స్ కారు.. Lamborghini Urus. 1980లలో లాంచ్ చేసిన మోడల్ స్పీడ్ గంటకు 305కిలోమీటర్లు. దీని ప్రారంభ ధర రూ.3.10కోట్లు.

naseer-urus

naseer-urus

10TV Telugu News