కరోనా చెత్తతో నిండిపోయిన గాంధీ ఆస్పత్రి ఆవరణ..దుర్వాసనతో ఇల్లు ఖాళీ చేస్తున్న స్థానికులు

  • Published By: nagamani ,Published On : August 3, 2020 / 12:39 PM IST
కరోనా చెత్తతో నిండిపోయిన గాంధీ ఆస్పత్రి ఆవరణ..దుర్వాసనతో ఇల్లు ఖాళీ చేస్తున్న స్థానికులు

కరోనా వైరస్ వచ్చిన తర్వాత గాంధీ ఆస్పత్రిలో చెత్త భారీగా పేరుకుపోతోంది. కరోనాకి సంబంధించి డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, రోగులు వాడిన పీపీఈ కిట్లు, మందులు, ఇంజెక్షన్లు, చెత్త అంతా… ఆస్పత్రి ఆవరణలోనే పేరుకుపోయి పడి ఉంది. రోజురోజుకూ అది కొండలా పెరుగిపోతోంది. ఈ చెత్తవ వల్ల ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది.దీంతో హాస్పిటల్ ప్రాంతంలో నివాసముండే స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ దగ్గర్లోని పద్మారావునగర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఈ చెత్త కంపును భరించలేక చాలా మంది ఆ ఏరియాలో నివాసముండేవాళ్లు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. స్థానికుల పరిస్థితి అలా ఉంటే ఇక ఆస్పత్రిలోనే డ్యూటీ చేసే డాక్టర్లు, వైద్యసిబ్బంది..రోగులు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తీవ్ర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. ఆ చెత్తను తొలగించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయనీ..కరోనాకు తోడు అంటు వ్యాధులు కూడా ప్రబలితే పరిస్థితి ఊహించటానికే భయంగా ఉందని అంటున్నారు.

ఈక్రమంలో చెత్త సమస్యను తాత్కాలికంగా తొలగించానికి ఆస్పత్రి సిబ్బందే చెత్తను ఓ ట్రాలీలో వేసి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. కానీ ప్రతీరోజు వారే ఈపనిచేయలంటే చాలా కష్టంగా ఉంటోందని వాపోతున్నారు. ప్రతీరోజు హాస్పిటల్ కు వచ్చే రోగులతో పాటు డాక్టర్లు, నర్సులు..ఇతర వైద్య సిబ్బంది ఆ చెత్త కంపునుంచే రావాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రి సిబ్బందే తాత్కాలికంగా చెత్తను తరలించాల్సి వస్తోందని..కాబట్టి తలకు మించిన భారం పనులు చేయలేకపోతున్నామని ఇప్పటికైనా చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



గాంధీ ఆస్పత్రిలో వెయ్యి మందికి పైగా కరోనా పేషెంట్లు చాలామందే ఉన్నారు. వాళ్లతోపాటూ డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, వార్డ్ బాయ్‌లు ఇలా అందరూ పీపీఈ కిట్లు ఉపయోగిస్తున్నారు. రోజూ 2వేలకు పైగా వాడుతున్న పరిస్థితి ఉంది. ఇలా నెలకు 60 వేల కిట్లు చెత్తగా మారుతున్నాయి. వాటిని ఎక్కడ పారేయాలో తెలియక… ఆస్పత్రి ఆవరణలోని ఓ రేకుల గది దగ్గర పడేస్తున్నారు. వాటిని రాంకీ సంస్థ ఏరోజు కారోజు తరలించాల్సి ఉంది. ప్రతీరోజూ ఆస్పత్రికి వచ్చి పని చేయాలంటే… ఆ చెత్త నుంచి వస్తున్న రకరకాల వాసనల్ని భరించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. చెత్తను తొలగించేలా పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.