శ్రీరాముడికి గొప్ప భక్తురాలైన శబరి వంశం మాది..చాలా అదృష్ణవంతుడ్ని : పాశ్వాన్

  • Published By: nagamani ,Published On : August 2, 2020 / 04:14 PM IST
శ్రీరాముడికి గొప్ప భక్తురాలైన శబరి వంశం మాది..చాలా అదృష్ణవంతుడ్ని : పాశ్వాన్

శ్రీరామ జన్మభూమి అయోధ్య రామమందిర నిర్మాణం భూమి పూజ దగ్గర పడుతున్న కొద్దీ పలువురిలో ముఖ్యంగా రామభక్తుల్లో ఉద్వేగం పొంగిపోతోంది. దశాబ్దాల కాలంలో ఎదురు చూస్తున్న శుభ తరుణానికి ఇంకా రెండు రోజులే ఉన్నాయి. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది.



ఈక్రమంలో తన జీవించిన ఈ కాలంలోనే రామాలయం నిర్మాణంకాబోతున్నందుకు నేను చాలా చాలా అదృష్టవంతుడినని పొంగిపోతూ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్. ఎందుకంటే తమది శ్రీరాముడికి పరమ భక్తురాలైన ‘శబరి’ వంశమని నేను శబరి వంశంలో పుట్టానని తెలిపారు చిరాగ్ పాశ్వాన్.

నిమ్నవర్గాల నుంచి వచ్చిన మతంగ మహర్షి శిష్యురాలు శబరి అని కొనియాడారు. మాత శబరికి సద్గుణాల రాశి అని..ఆమెకు అహంకారం లేదని అన్నారు. మాత శబరికి అహంకారం లేకపోటానికి నిదర్శనం రఘువంశంలో అత్యం ఘనకీర్తులు సంపాదించిన శ్రీరాముడు ఆమె స్వయంగా కొరికి ఎంగిలి చేసి..ఇచ్చిన పండ్లను శ్రీరాముడు స్వీకరించాడన్నారు. ఇంతకంటే ఆమె గొప్పతనానికి నిదర్శనమేముంటుందని అన్నారు. శ్రీరాముడు శబరిని తన తల్లి కౌసల్యతో సమానంగా భావించి ఆమె కొరికి ఇచ్చిన పండ్లను తిన్నాడన్నారు. అటువంటి శబరి వంశస్తుఢినైన తాను తన కళ్ళ ఎదుట రామాలయం నిర్మాణం జరుగుతుండటాన్ని చూడటం తన అదృష్టమని..ఇది నా జీవితంలో మరచిపోలేని అపురూపమైన అద్భుతమైన ఘట్టమని తన సంతోషాన్ని పంచుకున్నారు చిరాగ్ పాశ్వాన్.



ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామాలయానికి భూమి పూజ చేయబోతున్న సందర్భంగా పాశ్వాన్ ఆదివారం ట్విటర్ వేదికగా తన మనోభావాలను పంచుకున్నారు. తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. రామాలయం నిర్మాణం కేవలం మానవులకే కాకుండా, అన్ని జీవులు, జంతువులు, పశువులు, పక్షులకు సైతం సంతోషకరమని..ఆత్మ సంతోషాన్ని కలిగించే గొప్ప చారిత్రాత్మక వైభవం అని అన్నారు. ఎంతో గొప్పవాడైన శ్రీరాముడిని ఒక దేశానికి..జాతి చట్రాల్లో బంధించడం సాధ్యం కాదన్నారు.





బీహార్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్. 1983 అక్టోబరు 31లో జన్మించారు. రాజకీయవేత్త, లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడుగా మంచి పేరు సంపాదించారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో బీహార్ లోని జమూయ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సభ్యునిగా ఎన్నికైన చిరాగ్ పాశ్వాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. చిరాగ్ బాలీవుడ్ లో “మిలే నా మిలే హం” చిత్రంలో నటించారు.