ఫైనల్ ట్రయల్స్‌లో ఇండియా తొలి కొవిడ్ వ్యాక్సిన్ కొవాక్సిన్

ఫైనల్ ట్రయల్స్‌లో ఇండియా తొలి కొవిడ్ వ్యాక్సిన్ కొవాక్సిన్

Covaxin: ఇండియా మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న కొవిడ్ 19 వ్యాక్సిన్ కొవాక్సిన్‌ను భారత్ బయోటెక్ దాదాపు డెలివరీకి రెడీ చేసేసింది. ఫైనల్ ట్రయల్స్ లో భాగంగా ఫేజ్ 3ట్రయల్స్ జరుగుతున్నట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ కృష్ణా ఎల్లా అంటున్నారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఎల్లా.. కొవిడ్ 19ను తగ్గించేందుకు తయారుచేసే మరో వ్యాక్సిన్ పనిలో పడ్డట్లు చెపపారు. వచ్చే ఏడాది నాటికి రానున్న ఆ వ్యాక్సిన్ మాత్రం ముక్కులో డ్రాప్స్ రూపంలో ఉంటుందని తెలిపారు.



‘ఫేజ్ 3 ట్రయల్స్ లో ఉన్న ఈ కొవిడ్ 19 వ్యాక్సిన్ ఐసీఎమ్మార్‌తో కలిసి తయారుచేస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే బీఎస్ఎల్3 ప్రొడక్షన్ ఫెసిలిటీ(బయోసేఫ్టీ లెవల్ 3) సదుపాయం ఉన్న ఏకైక వ్యాక్సిన్ అని అన్నారు. వ్యాక్సిన్ తయారుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా కోపరేషన్ కావాలని అంటున్నారు.

గత నెలలో వ్యాక్సిన్ మేకర్ ఫేజ్ 1, ఫేజ్ 2ట్రయల్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశామని అన్నారు. ఫేజ్ 3 ట్రయల్స్ లో దాదాపు 26వేల మంది పార్టిసిపెంట్స్ పొల్గొంటున్నట్లు ఆయన చెప్పారు.

కొవాక్సిన్‌ను భారత్ బయోటెక్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ మేకర్ అక్టోబర్ 2న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) పర్మిషన్ తీసుకుని ఫేజ్ 3ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

సెప్టెంబరులో వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి లైసెన్స్ అగ్రిమెంట్ దక్కించుకుంది.