కరోనానే కారణమా? : మెరుగుపడని మార్కెట్.. దశాబ్ధంలో ఇదే చెత్త జీడీపీ!

  • Published By: vamsi ,Published On : August 31, 2020 / 05:02 PM IST
కరోనానే కారణమా? : మెరుగుపడని మార్కెట్.. దశాబ్ధంలో ఇదే చెత్త జీడీపీ!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (GDP) సంఖ్యలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. 1996లో త్రైమాసిక డేటా ప్రచురించిప్పటి నుంచి ఇదే అత్యంత చెత్త జీడీపీ నమోదు అని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశానికి సంబంధించి 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. కోవిడ్ -19 కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాల నుంచి చాలా వరకు స్పష్టంగా తెలుస్తుంది. మార్కెట్ మరియు పెట్టుబడిదారులు కూడా జీడీపీ డేటాను చూస్తున్నాయి. ఆర్‌బిఐకి చెందిన అన్ని రేటింగ్ ఏజెన్సీలు జీడీపీలో పెద్దగా పడిపోయే అవకాం ఉంది.

ఆర్థిక వృద్ధి గత కొన్నేళ్లుగా మందగిస్తోండగా.. ఇప్పుడు వచ్చిన గణాంకాలు మాత్రం దశాబ్దాలలోనే అత్యంత చెత్త గణాంకాలు అని నిపుణులు అంటున్నారు. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి లాక్‌డౌన్‌ అమలు చేసింది ఏప్రిల్ – జూన్ నెలల్లోనే కావడంలో జీడీపీ భారీగా పడిపోయింది.

ఈ కాలంలో ఆహార సరఫరా, అత్యవసర సేవలు మినహా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు జరగలేదు. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఒక ప్రకటన చేసారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని ప్రభావం కనిపిస్తుంది,

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు. 2020 ఏప్రిల్ నుంచీ జూన్ వరకూ, త్రైమాసిక వృద్ధి రేటు గణాంకాలను తీసుకుంటే వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది.

ఆగస్టు 17 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ప్రచురించిన ఎకోవ్రాప్, క్యూ 1 ఎఫ్‌వై 21 జిడిపి క్షీణత -16.5% ఉంటుందని అంచనా వేసింది, అయితే మహమ్మారి కారణంగా ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో సంబంధిత జాగ్రత్తలు ఉన్నాయి.

ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో స్థూల జాతీయోత్పత్తి జూన్ త్రైమాసికంలో 18.3శాతం తగ్గిపోతుందని రాయిటర్స్‌లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు, అంతకుముందు త్రైమాసికంలో 3.1% వృద్ధితో పోలిస్తే, కనీసం ఎనిమిది సంవత్సరాలలో ఇవే చెత్త గణాంకాలు.

అదే ఆర్థికవేత్తలు సెప్టెంబర్ మరియు డిసెంబర్ త్రైమాసికాలలో వరుసగా 8.1% మరియు 1.0% సంకోచాన్ని అంచనా వేస్తున్నారని ఏజెన్సీ తెలిపింది. సింగపూర్ క్యాపిటల్ ఎకనామిక్స్‌లో భారత ఆర్థికవేత్త షిలాన్ షా, కరోనావైరస్ మహమ్మారికి సంబంధించిన లాక్‌డౌన్ల వల్ల కలిగే ఆర్థిక నష్టం ఆసియాలోని ఇతర దేశాల కంటే భారతదేశంలో చాలా ఘోరంగా ఉందని చెప్పారు.

లాక్‌డౌన్ కారణంగా కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మే నెలలో రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా 5.94 లక్షల కోట్ల రూపాయలను చిన్న వ్యాపారులకు రుణాలు అందించడానికి, నాన్-బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు సాయం అందించడానికి కేటాయించింది.

అంతేకాకుండా, వలస కూలీలకు రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడానికి, రైతులకు రుణాలు ఇవ్వడానికి 3.10 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించింది. అలాగే 1.5 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ సంబంధిత రంగాలపై ఖర్చుపెట్టేందుకు కేటాయించింది.

ఈ ప్యాకేజీ ప్రకటించినప్పటి నుంచి మూడు నెలలు గడిచాయి. చాలా చోట్ల వ్యాపారాలు తెరుచుకున్నాయి. మార్చి నుంచి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి ఉపశమన చర్యలను ప్రకటించారు.