రద్దీ రోడ్లపై కరోనా శవపేటికలు పెట్టి..ప్రజల్ని భయపెడుతున్న ప్రభుత్వం

  • Published By: nagamani ,Published On : August 22, 2020 / 01:24 PM IST
రద్దీ రోడ్లపై కరోనా శవపేటికలు పెట్టి..ప్రజల్ని భయపెడుతున్న ప్రభుత్వం

ఇండోనేషియాలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని జకార్తలాలో ఈ మహమ్మారిని పెరుగుతున్నా..ప్రజలు మాత్రం ఏమాత్రం నిబంధనలు పాటించటంలేదు. మాస్కులు పెట్టుకునేవారు అతి తక్కువగా ఉంటున్నారు. ఈ వి షయాన్ని స్వయంగా స్థానిక ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. దీంతో ప్రజల్ని భయపెట్టైనా సరే నిబంధనల్ని పాటించాలని భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు అనుకున్నారు.



దీంతో..జకార్తాలలోనే రష్ గా ఉండే రోడ్లపై ఖాళీ శవపేటికల్ని పెట్టారు. వాటిపై “COVID-19 బాధితుడు”అనే ఎర్రటి రంగు అక్షరాలతో రాసి పెట్టారు. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో ఎంతమంది కరోనా సోకి చనిపోయారు? ఎంతమందికి కరోనా బాధితులు ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ ను రాసిపెట్టారు.అలాగే దేశ వ్యాప్తంగా కూడా అలాగే పెట్టారు.



ఎరుపు అంటే డేంజర్ కదా..వీటిని చూసి ప్రజలు భయపడి మాస్కులు పెట్టుకోవటం గ్లవుజులు ధరించటం వంటి భద్రత పాటిస్తారని ఇలా శవపేటికల్ని రోడ్లపై ఏర్పాటు చేశామని జకార్తా మాంపాంగ్ ప్రపాటన్ సబ్ డిస్ట్రిక్ట్ చీఫ్ జజారుద్దీన్ తెలిపారు. మరి అధికారుల అంచనాల ప్రకారం ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తారా? సమాజం పట్ల బాధ్యతగా భద్రతా చర్యలు పాటిస్తారా? లేదో చూడాలి…..