కాలేజ్ ఫీజు కోసం ఫోన్ దొంగిలించిన విద్యార్థిని..ఉద్యోగం వచ్చాక తిరిగిచ్చేస్తా..

  • Published By: nagamani ,Published On : August 8, 2020 / 06:46 PM IST
కాలేజ్ ఫీజు కోసం ఫోన్ దొంగిలించిన విద్యార్థిని..ఉద్యోగం వచ్చాక తిరిగిచ్చేస్తా..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ విద్యార్థిని ఇంటర్ ఫీజు కట్టటం కోసం ఓ ఫోన్ దొంగిలించింది. ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె దొంగిలించిన ఫోన్ గల వ్యక్తి ఓ ప్రైవేటు డిటెక్టివ్ యజమానిది. తన ఫోన్ దొంగిలించినవారు ఎవరో తెలుసుకోవటానికి అతను తన తెలివితేటలతో ఓ అమ్మాయి దొంగిలించిందని తెలుసుకున్నాడు. కారణం కూడా తెలుసుకుని పాపం అనుకున్నాడు. అలా అని వదిలేయకుండా ఆమె చదువులకుసహాయం చేస్తాననని మాటిచ్చాడు.

జూనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన 16 ఏళ్ల అమ్మాయి 71 శాతం మార్కులతో పాస్ అయ్యింది. సెకండియర్ లోకి వెళ్లాలంటే ఫీజు కట్టాలి. కానీ తన కుటుంబానికి అంత స్తోమత లేదు. దీంతో ఓ వ్యక్తినుంచి ఫోన్ దొంగిలించింది. దాన్ని రూ.2,500కి తాకట్టు పెట్టింది. అక్కడే అసలు విషయం జరిగింది. ఆ అమ్మాయి దొంగిలించిన ఫోన్ ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీకి అధిపతి ధీరజ్ దూబేది.

తన ఫోన్ ఎవరో కొట్టేయటంతో ధీరజ్ దూబే తన తెలివితేటలతో ఆ అమ్మాయిని పట్టుకుని ప్రశ్నించాడు. దీంతో దీన స్థితి చెప్పిందామె. తాను కాలేజ్ ఫీజు కట్టాల్సిన నోటీసులను చూపించింది. బిక్కు బిక్కుమంటూ ధీరజ్ వంక చూసింది. సార్..నేను డబ్బుల కోసం మీ ఫోన్ దొంగలించలేదు. కాలేజ్ ఫీజుల కోసమే..దాన్ని నేను అమ్మేయలేదు..తాకట్టు పెట్టాను..నా చదువు పూర్తయ్యాక నాకు ఉద్యోగం వచ్చాక మీ ఫోన్ విడిపించి మీకు ఇచ్చేస్తానని దీనంగా చెప్పింది. ఆ మాటలు విన్న ధీరజ్ మనస్సు కరిగిపోయింది. నువ్వేమీ భయపడకు నిన్నేమీ పోలీసులకు పట్టించని ధైర్యం చెప్పాడు. తరువాత ధీరజ్ రూ.2,500 చెల్లించి తన ఫోన్ విడిపించుకుని..ఆ విద్యార్థినికి అవసరమైన డబ్బు కూడా ఇచ్చాడు.

ఈ విషయంపై డిటెక్టివ్ ధీరజ్ దూబే మాట్లాడుతూ తన ఫోన్ దొంగిలించటానికి కారణం చదువు అంటే ఆ అమ్మాయికి ఇష్టం కావటమే. నిజంగా డబ్బుల కోసం ఫోన్ కొట్టేసి ఉంటే అమ్మేసేది..కానీ తన అవసరం కోసం ఆ ఫోన్ ను అమ్మేయకుండా తాకట్టు పెట్టానని చెప్పింది. పైగా తనకు ఉద్యోగం వచ్చాక విడిపించి ఇచ్చేస్తానని చెప్పటం ఆ విద్యార్థిని పరిస్థితేనని తెలిపాడు. తనకు ఉద్యోగం వస్తే ఆ ఫోన్ విడిపించి మళ్లీ నాకు ఇచ్చేయాలనుకుందట. ఈ విషయం నన్నెంతో కదిలించింది” అని చెప్పాడు.
అంతేకాకుండా..ఆ అమ్మాయి చదువు విషయం తాను ఓ డాక్టర్ కు కూడా చెప్పానని..దానికి డాక్టర తో పాటు మరో టీచర్ ఆమెకు సహాయం చేయటానికి ముందుకొచ్చారు. ఆమె చదువుకు కావాల్సిన ఖర్చులను తాము భరిస్తామని హామీ ఇచ్చారని చెప్పాడు.