గాడిద ఎక్కినపెళ్లికొడుకు..శ్మశానానికి ఊరేగింపుగా వెళ్లి..పూజలు!

  • Published By: nagamani ,Published On : July 28, 2020 / 10:28 AM IST
గాడిద ఎక్కినపెళ్లికొడుకు..శ్మశానానికి ఊరేగింపుగా వెళ్లి..పూజలు!

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ దగ్గరలో ఉన్న ఓగ్రామంలో పెళ్లి కొడుకు గాడిద మీద ఊరేగుతున్నాడు. సాధారణంగా పెళ్లికొడుకు గుర్రాల మీద ఊరేగుతారు.లేదంటే గుర్రపు బండిపై ఊరేగుతారు. కానీ పెళ్లి కొడుకు గెటప్ తో గాడిదపై ఊరేగుతున్నవ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. పైగా అతను గాడిదపై ఊరేగుతూ శ్మసానానికి వెళ్లాడు.పెళ్లి కొడుకు శ్మసానానికి వెళ్లటమేంటీ అరిష్టం కదాని అనుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే..

ఇండోర్ నగర అధ్యక్షుడు శివ్‌డింగు వరుడి గెటప్ వేసి గాడిదపై కూర్చున్నాడు. నగర నడిబొడ్డు నుంచి శ్మశానం వరకూ ఊరేగింపుగా వెళ్లాడు. అక్కడ ఉప్పుపోసి పూజలు చేసిన వర్షాలు కురవాలని భగవంతున్ని ప్రార్థించాడు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని వాళ్లు నమ్ముతుంటారు. ఈ క్రమంలో వర్షాకాలం వచ్చినా కూడా సాగునీటికి, త్రాగునీటికి సరిపడా వానలు లేకపోవడంతో వేడి వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వర్షాల కోసం గాడిదపై ఊరేగడం ఆసక్తిగా మారింది.

వరుడి గెటప్ వేసి శివ్ డింగు డోలు వాయిద్యాలతో గాడిదపై ఊరేగుతుంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు. కాగా గతంలో కూడా శివ్ డింగు వర్షాల కోసం నాలుగు సార్లు ఇలాగే గాడిదమీద ఊరేగాడు. దాంతో వర్షాలు బాగా పడ్డాయని స్థానికులు అంటున్నారు. అందుకే ఈసంవత్సరం కూడా శివ్ డింగూని గాడిదపై ఊరేగించటానికి కారణమంటున్నారు.