Viral Video: పీకలదాకా తాగి నడిరోడ్డుపై రెచ్చిపోయిన నలుగురు అమ్మాయిలు

పీకలదాకా తాగి నడిరోడ్డుపై రెచ్చిపోయారు నలుగురు అమ్మాయిలు. ఓ యువతిని కింద పడేసి కొడుతూ, తిట్టారు. ఓ అమ్మాయి బెల్టు పట్టుకుని మరీ కొట్టింది. మరో అమ్మాయి బాధిత యువతి మొబైల్ ఫోనులు పగులకొట్టింది. ఈ దారుణ ఘటనను అక్కడున్న అబ్బాయిలు చూస్తూ ఉండిపోయారే తప్ప ఆ రౌడీ అమ్మాయిలను అడ్డుకునే ధైర్యం చేయలేదు. ఆ అమ్మాయిలు పాల్పడ్డ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్, ఎల్ఐసీ తిరహా వద్ద చోటుచేసుకుంది.

Viral Video: పీకలదాకా తాగి నడిరోడ్డుపై రెచ్చిపోయిన నలుగురు అమ్మాయిలు

Viral Video: పీకలదాకా తాగి నడిరోడ్డుపై రెచ్చిపోయారు నలుగురు అమ్మాయిలు. ఓ యువతిని కింద పడేసి కొడుతూ, తిట్టారు. ఓ అమ్మాయి బెల్టు పట్టుకుని మరీ కొట్టింది. మరో అమ్మాయి బాధిత యువతి మొబైల్ ఫోనులు పగులకొట్టింది. ఈ దారుణ ఘటనను అక్కడున్న అబ్బాయిలు చూస్తూ ఉండిపోయారే తప్ప ఆ రౌడీ అమ్మాయిలను అడ్డుకునే ధైర్యం చేయలేదు.

ఆ అమ్మాయిలు పాల్పడ్డ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్, ఎల్ఐసీ తిరహా వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని, అయితే, ఈ వీడియో చూశాక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నలుగురు అమ్మాయిలు దారుణంగా కొడుతుండడంతో బాధిత యువతి తిరగబడలేకపోయింది. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..