ఆవుపేడతో రాఖీలు,వినాయక విగ్రహాలు తయారీ..కరోనాకష్టకాలం ఇండోర్ మహిళల ప్రతిభ

  • Published By: nagamani ,Published On : July 25, 2020 / 01:19 PM IST
ఆవుపేడతో రాఖీలు,వినాయక విగ్రహాలు తయారీ..కరోనాకష్టకాలం ఇండోర్ మహిళల ప్రతిభ

కరోనా కష్టకాలంలో మహిళలు ఇంటికి అండగా నిలబడుతున్నారు. కరోనా సంక్షోభంలో ఆవు పేడతో పర్యావరణ రాఖీల తయారీ చేసి వాటిని విక్రయిస్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఆగస్టు 3న రక్షా బంధన్ సందర్భంగా ఆవుపేడతో రాఖీల తయారీకి ఇండోర్ మహిళ శ్రీకారం చుట్టారు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిర్భార్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇండోర్ నగరానికి చెందిన శ్వేతా పలివాల్ అనే మహిళ ఆవుపేడతో రాఖీలను తయారు చేశారు.


ఇండియా-చైనా మధ్య నెలకొన్న భూ వివాదాల కారణంగా చైనా వస్తువులను బహిష్కరించడంతోపాటు స్వదేశీ వస్తువుల తయారీని ప్రారంభించిన శ్వేతా పర్యావరణ హిత రాఖీలే కాదు..గణేష్ చతుర్థికి ఆవుపేడతో వినాయక విగ్రహాలను కూడా తయారు చేశారు. కాటన్ వస్త్రాలతో వివిధ రకాల డిజైన్లతో ఫేస్ మాస్కులు సైతం శ్వేతా తయారు చేశారు. ఆమెలోని ప్రతిభకు తోటి మహిళలు కూడా ఆశ్చర్యపోతున్నారు.



ఆవుపేడతో రాఖీలు..వినాయక విగ్రహాలనే కాకుండా శ్వేత పలివాల్ ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఆర్టికల్స్ ను కూడా తయారుచేస్తున్నారు వాటికి చక్కటి రంగులతో అద్బుతమైన పెయింటింగులు వేసి చూడముచ్చటగా తయారు చేస్తున్నారు. ఆవు పేడ, మట్టితో యాంటీ రేడియేషన్ మొబైల్ స్టాండులు, రాఖీలు తయారు చేసి వాటిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంపించనున్నట్లు శ్వేతా చెప్పారు.


కరోనా కష్టకాలంలో శ్వేతా వాలియా తోటి మహిళలకు కూడా ఆవుపేడతో వస్తువులను తయారు చేయటంతో ట్రైనింగ్ ఇస్తున్నారు. వారి వారి కుటుంబాలకు కరోనా కష్టకాలంలో అండగా ఉండేందుకు సహాయం చేస్తున్నారు శ్వేతా పలివాల్.