ఇంద్రకీలాద్రిపై వివాదం : మ్యాక్స్ కంపెనీకి సెక్యూర్టీ టెండర్లు..అర్ధరాత్రి ఆర్డర్

  • Published By: madhu ,Published On : September 2, 2019 / 10:55 AM IST
ఇంద్రకీలాద్రిపై వివాదం : మ్యాక్స్ కంపెనీకి సెక్యూర్టీ టెండర్లు..అర్ధరాత్రి ఆర్డర్

ఇంద్రకీలాద్రిపై మరో వివాదం రాజుకుంది. సెక్యూరిటీ టెండర్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి సెక్యూరిటీ కోసం 3 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎజైల్, మ్యాక్‌ కంపెనీలకు అర్హత ఉందని గుర్తించిన దుర్గగుడి అధికారులు నెలరోజుల తర్వాత టెండర్లు తెరిచారు. మ్యాక్స్‌ కంపెనీకి టెండర్ కట్టబెడుతూ అర్ధరాత్రి ఆర్డర్ రెడీ చేశారు.

దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఎజైల్ కంపెనీ. అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది. సెక్యూరిటీ టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజయవాడ దుర్గగుడి ఆలయ కార్యనిర్వాహణాధికారి సురేశ్‌బాబు స్పందించారు. సెప్టెంబర్ 02వ తేదీ సోమవారం 10tvతో మాట్లాడారు. ఆరోపణల్లో నిజంలేదన్నారు. టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్నారు. 

ఒకటే రేటు వేశారని..గతంలో ఎజైల్ కంపెనీ చేసిందని..ఈ కంపెనీపై పలు ఆరోపణలు వచ్చాయన్నారు. సర్వీసెస్ బాగా లేవని సెక్యూర్టీ సిబ్బంది చెప్పారని..అంతేగాకుండా తమకు రాసిచ్చారన్నారు. టెంపుల్‌కు సెక్యూర్టీ చాలా ఇంపార్టెంట్ అన్న ఆయన..నెలకు రూ. 20 లక్షలు ఇస్తున్నట్లు..మొత్తం 170 మంది ఉన్నారన్నారు. ఇది చాలా ఎక్కువ ఖర్చు అని, పీఎఫ్, ఈఎస్ఐ ఇద్దరికి తీసుకున్నట్లు వెల్లడిస్తూ..ఒకరికి మాత్రమే కట్టబెడుతూ టెంపుల్‌ను మోసం చేసినట్లేనని స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో శానిటేషన్, సెక్యూర్టీ టెండర్ల విషయంలో కొత్త రూల్స్ చేస్తున్నారని, దీనివల్ల టెండర్లు తెరవడంలో ఆలస్యం అయ్యిందని తెలిపారు. 
Read More : గణపతి బప్పా మోరియా : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు